కలవరం..! | - | Sakshi
Sakshi News home page

కలవరం..!

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

కలవరం

కలవరం..!

కలవరం..!

విజయనగరం ఫోర్ట్‌: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగులు కల్పిస్తామని చంద్రబాబు సర్కార్‌ గొప్పగా సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామిలను గాలికి వదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టేసి విధంగా చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తుంది. చైల్డ్‌లైన్‌ 1098 సంస్థలో పని చేసే ఉద్యోగులను చంద్రబాబు సర్కార్‌ అయోమయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. గత మూడేళ్లుగా పని చేస్తున్న తమ ఉద్యోగాలు ఉంటాయో, ఉండవో తెలియక సతమతమవుతున్నారు.

ఏజెన్సీకి అప్పగించే ప్రయత్నం

18 ఏళ్లలోపు పిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఏర్పాటైన చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ ఐసీడీఎస్‌ ఆధీనంలో నిర్వహిస్తుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. 2023 జూలై 7వ తేదీ నుంచి వీరు పని చేస్తున్నారు. అయితే చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ నిర్వాహణ బాధ్యతలను ఏజెన్సీకి ఇవ్వాలని టీడీపీ సర్కార్‌ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే టెండర్‌ కూడా పిలిచేసింది. ఒకటి రెండు రోజుల్లో టెండర్‌ కూడా ఖరారు కానుంది. టీడీపీకి చెందిన అస్మదీయులకు ఏజెన్సీని కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీకి చైల్డ్‌లైన్‌ నిర్వాహణను అప్పగిస్తే తమ ఉద్యోగాలు పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 31 వరకే కొనసాగించాలని ఆదేశాలు

చైల్డ్‌లైన్‌ 1098 సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మార్చి 31 వరకు మాత్రమే కొనసాగించాలని తర్వాత చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ బాధ్యతలను ఏజెన్సీ చూసుకుంటుందని ఐసీడీఎస్‌ అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ఐసీడీఎస్‌ అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో కొత్తగా వచ్చే ఏజెన్సీ వారు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు గుర్తించి ఏమి ప్రస్తావించలేదని తెలిసింది. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్‌ నెలకొంది. చైల్డ్‌లైన్‌ 1098 సంస్థలో ఇద్దరు సూపర్‌వైజర్లు, ముగ్గురు కేస్‌ వర్కర్లు పని చేస్తున్నారు. వీరిలో సూపర్‌ వైజర్‌కు రూ.19,500, కేస్‌ వర్కర్‌కు రూ.15,600 చెల్లిస్తున్నారు.

విధులు ఇలా...

బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ట్రోల్‌ ఫ్రీ నంబరు 1098కు ఫోన్‌ వస్తే సంబంధిత ప్రాంతానికి పోలీసులు, అంగన్‌వాడీ, ఐసీడీఎస్‌ అధికారులతో కలిసి వెళ్లి ఈ వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని ఇరువురి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాల్య వివాహాన్ని నిలుపుదల చేస్తారు. తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయి దొరికినట్టయితే వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లలు దొరికినట్టయితే తల్లిదండ్రులకు అప్పగించడం, బాలలను ఎవరైనా పనిలో పెట్టుకున్నట్టు సమాచారం వస్తే కార్మిక శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు చేసి బాలలకు విముక్తి కల్పించడం, 18 ఏళ్లలోపు పిల్లలు ఆపదలో ఉంటే వారికి రక్షణ, సంరక్షణ కల్పించడం వీరి విధి.

చైల్డ్‌లైన్‌ ఉద్యోగుల్లో అయోమయం

1098 నిర్వహణను ఏజెన్సీకి అప్పగించే యత్నం

ఏజెన్సీ కోసం టెండర్‌ పిలిచిన

చంద్రబాబు ప్రభుత్వం

మార్చి 31తో ముగియనున్న కాలపరిమితి

తమను తొలగిస్తే ఎలా బతికేదని ఆవేదన!

మార్చి 31 వరకే..

ఈ ఏడాది మార్చి 31 వరకే చైల్డ్‌లైన్‌ సిబ్బందిని కొనసాగించాలని ఆదేశాలు వచ్చాయి. సిబ్బంది గురించి అందులో ఏమి చెప్పలేదు.

– ఎల్‌.సుజాత, ఇన్‌చార్జ్‌ పీడీ, ఐసీడీఎస్‌

కలవరం..!1
1/1

కలవరం..!

Advertisement
 
Advertisement
Advertisement