మెరకముడిదాం: డీఆర్‌డీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరకముడిదాం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మండలానికి చెందిన వీఓఏలు, జండర్, ఆరోగ్య కమిటీ సభ్యులకు గురువారం ఒకరోజు శిక్షణ తరగతులను ఏర్పాటుచేశారు. శిక్షణ కోసం సభ్యులందరూ ఉదయం 10 గంటలకే హాజరుకాగా, శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన ఇన్‌చార్జి ఏపీఎం గీత 11.30 గంటల వరకూ హాజరుకాలేదు. ఆమె రాకకోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో సీసీలు సూర్యనారాయణ, కోటేశ్వరరావు శిక్షణను కొనసాగించారు. శిక్షణ తరగతుల నిర్వ హణపై అధికారి నిర్లిప్తతను పలువురు సభ్యులు తప్పుబట్టారు.


