రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ మూడో ఫ్లాట్‌ఫామ్‌పై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్‌పీ పోలీసులు బుధవారం కనుగొన్నారు. షాలీమార్–చైన్నె వెళ్తున్న ట్రైన్ నుంచి జారి పడినట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ ఎస్‌ఐ బాలాజీ తన సిబ్బందిని ఘటనా స్థలికి పంపించారు. మృతుని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బైక్ ఢీకొని రైతు దంపతులకు గాయాలు
వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామానికి చెందిన వూళ్ల రామారావు ,ప్రమీల దంపతులు తమ పొలంలో పనులు ముగించుకుని ఇంటికి నడిచి వెళుతుండగా రమేష్ అనే వ్యక్తి బైక్‌తో వారిని ఢీకొట్టడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. నడిమికెల్ల సీఎస్‌పీ రహదారిపై వెళుతున్న వీరిద్దరినీ మద్యం మత్తులో బైక్‌తో వస్తున్న వ్యక్తి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం వీరఘట్టం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ షణ్ముఖరావు తెలిపారు.


