కమాండెంట్‌ను కలిసిన అసోసియేషన్‌ ప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

కమాండెంట్‌ను కలిసిన అసోసియేషన్‌ ప్రతినిధులు

Mar 6 2026 8:05 AM | Updated on Mar 6 2026 8:05 AM

డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌ వై.రవిశంకర్‌రెడ్డిని 5వ ఏపీఎస్‌పీ మినిస్టీరియల్‌ నూతన అసోసియేషన్‌ కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ జె.హరిబాబు, వైస్‌ ప్రెసిడెంట్‌ టి.తవిటినాయుడు, సెక్రటరీ కేజేవీ ప్రసాదరావు, ట్రెజరర్‌ బి.బాబీశ్యామిలి, జాయింట్‌ సెక్రెటరీ బి.గీత, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ జి.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు ఐ.భవాని, ఎం.ప్రవీణ్‌, వి.రోహిణి, ఎం.సీత, యు.గోవింద తదితరులు ఉన్నారు.

డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీరాములనాయుడు

విజయనగరం కలెక్టరేట్‌: డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీరాములనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఇదిలా ఉండగా మెంటాడ తహసీల్దార్‌గా విజయ్‌ భాస్కర్‌ను నియమించారు. దత్తిరాజేరు తహసీల్దార్‌గా ఉన్న ఆయన గత కొన్ని నెలలుగా సెలవులో ఉన్న విషయం తెలిసిందే.

కుక్కల దాడిలో 18 మందికి గాయాలు

బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్తులపై దాడి చేసి పలువురిని గాయపరిచాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు.. నెలివాడలో గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో 18 మందిని వీధి కుక్కలు గాయపరిచాయి. వీరంతా జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందారు. కుక్కల దాడిలో గ్రామానికి చెందిన నెట్టి అనురాధ, ముడిదాన కనకమహాలక్ష్మి, పెండి అరసవల్లి, శివుడు రాజు, కోమ్మా రమ, లక్ష్మి, కె.నూకరాజు, సత్తిబాబుతో పాటు పురమనేని లక్ష్మినాయుడు ఉన్నారు. దీనిపై స్పందించిన సర్పంచ్‌ తాళ్లపూడి కీర్తి, ఈఓపీఆర్‌డీ ఎ.రఘుపతిరావు కుక్కల నుంచి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఆలయ చోరీ నిందితుల పట్టివేత

నెల్లిమర్ల: పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో చోరీ చేసిన నిందితులను పట్టుకున్నట్టు ఎస్‌ఐ బి.గణేష్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నిందితులు ఇద్దరూ జిల్లా కేంద్రంలోని లంకాపట్నంకి చెందిన మైనర్లని, వీరికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని తెలిపారు. వీరిద్దరూ మద్యానికి బానిసలుగా మారి చెడు వ్యసనాలతో దొంగతనాలు చేస్తున్నారని, వాహన తనిఖీల్లోభాగంగా ఇద్దరినీ పట్టుకున్నామని చెప్పారు. నిందితులు నుంచి దొంగతనానికి ఉపయోగించిన ఒక పల్సర్‌ బైక్‌ సీజ్‌ చేశామన్నారు. నిందితులు హుండీలో దొంగిలించిన సొమ్మును పూర్తిగా ఖర్చు చేశారని, వారిని కోర్టు ఆదేశాల మేరకు జువైనల్‌ హోంకు తరలించినట్టు తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై మృతదేహం

విజయనగరం క్రైమ్‌ : విజయనగరం – కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య, జొన్నవలస రైల్వేగేట్‌ రైల్వే ట్రాకై ్ప గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్‌ ప్రసాద్‌ గురువారం తెలిపారు. సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన మృతదేహం 5 అడుగుల 2 అంగుళాల పొడవు కలిగి ఉంటాడరన్నారు. చామన ఛాయ రంగుతో, నీలం రంగు గల రౌండ్‌ నెక్‌ టీ షర్టు, వైలెట్‌ కలర్‌ నిక్కర్‌ ధరించి ఉందన్నారు. మృతదేహం పక్కనే తెలుపు, ఎరుపు గీతల గల తువ్వాలు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వాళ్లు 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్‌ఐ బాలాజీరావు ఆదేశాలతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement