ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
లక్కవరపుకోట : మండలంలోని తలారి గ్రామంలో అచ్చియ్యమ్మ పేరంటాలు తీర్థం సందర్భంగా శనివారం నిర్వహించిన ఎడ్లు పరుగు పందెం పోటీలు ఉల్లాసంగా సాగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన 11 ఎడ్లు బళ్లు పాల్గొన్నట్టు నిర్వాహుకులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్లు బళ్లు యజమానులకు వరుసగా రూ.12వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు చొప్పున నగదు బహుమతులను అందజేశారు.
ఫైర్ అండ్ సేఫ్టీ డిగ్రీకి
సువర్ణావకాశం
విజయనగరం గంటస్తంభం: పారిశ్రామిక భద్రత రంగంలో నిపుణులను తీర్చిదిద్దే దిశగా ఐఐఎఫ్‌ఎస్‌ఈ, కళింగ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఐఐఎఫ్‌ఎస్‌ఈ డైరెక్టర్ శ్రీను మహంతి, కళింగ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.సందీప్ గాంధీ సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంతో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సు ప్రారంభమైంది. యూజీసీ గుర్తింపు పొందిన ఈ కోర్సు ఎన్‌ఎస్‌క్యూఎఫ్ లెవల్–7 సమాన హోదాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు ఉద్యోగం వదలకుండా ఆన్‌లైన్ విధానంలో చదివే అవకాశం కల్పించారు. ఇండస్ట్రీయల్ సేఫ్టీ, హజార్డ్ మేనేజ్‌మెంట్, ఫైర్ ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఇది మార్గం చూపుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కోర్సులలో చేరాలనుకున్న ఆసక్తి గల అభ్యర్థులు 9704106261 నంబరును సంప్రదించాలని సూచించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఐఎఫ్‌ఎస్‌ఈఇండియా.ఇన్‌లో వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.


