వంగర: ఉపాధి హామీ పథకం ఏపీఓ మర్రాపు సత్యవతి సస్పెండ్ అయినట్టు డ్వామా ఏపీడీ చంద్రకుమారి గురువారం తెలిపారు. విధుల నిర్వహణలో లోపాలను గుర్తించి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 3వ తేదీన ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. రేగిడి ఏపీఓ ఎస్.హరినాథ్‌ను ఇన్‌చార్జి ఏపీఓగా నియమించారన్నారు.
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో గత రెండు నెలలుగా జ్వరాల కేసులు పెరగడం, ఆస్పత్రుల కు రోగుల తాకిడి అధికమైందన్న అంశంపై ఈ నెల 4వ తేదీన ‘జిల్లాకు జ్వరమొచ్చింది ..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్యాబ్‌ను జిల్లా మలేరియా అధికారి ఎం.సింహాచలం గురువా రం పరిశీలించారు. జ్వరాల వ్యాప్తి, కేసుల నమోదుపై ఆరా తీశారు. మలేరియా, డెంగీ కేసుల నమోదు వివరాలను ల్యాబ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
నేరడిలో ఘీం‘కరి’ంపు
భామిని: మండలంలోని నేరడి గ్రామ సమీపంలో ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. రెండు జతలుగా వీడి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక జత ఏనుగులు వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఎగువ భాగానికి వెళ్లి పంటలకు నష్టం కలిగించాయి. మరోజత బిల్లుమడ వైపు పంటపొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేశాయి. జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులను స్థానికులు దారిమళ్లించే యత్నం చేస్తున్నారు.
సాలూరు: జీతాలు పెంచాలని, పనిగంటలు తగ్గించాలని, వసతులు కల్పించాలని కోరుతూ సాలూరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్ల ధర్నాకు మాజీ డిప్యూటీసీఎం పీడిక రాజన్నదొర గురువారం సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయా యాజమాన్యాలను కోరారు.


