
ఆరోగ్యకరమైన ఆహారమే నా మెరిసే చర్మానికి కారణం. పైగా నాది డ్రై స్కిన్ కావడంతో రోజూ చర్మాన్ని నెమ్మదిగా శుభ్రం చేసి, మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. రాత్రి మేకప్ తీసేయకుండా అసలు నిద్రపోను. సాదాసీదా దుస్తులను కూడా ప్రత్యేకంగా మార్చడమంటే చాలా ఇష్టం అని అంటోంది పూజా హెగ్డే.
మేకప్ తక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ.. అదే పూజా హెగ్డే ఫ్యాషన్ ఫార్ములా! రెడ్‌కార్పెట్ మీద మెరిసే గౌనులోనైనా, బీచ్‌లో బ్రీజీ డ్రెస్‌లోనైనా, లేదా జిమ్ బయట ట్రాక్‌పాంట్‌లోనైనా ఆమె లుక్ ఎప్పుడూ ‘వావ్!’ అనిపించేస్తుంది. ఇదే ఆమె మ్యాజిక్, ఎప్పుడూ ఆన్‌లో ఉండే గ్లో!. ఇక్కడ ధరించి పూజా డ్రెస్ బ్రాండ్: అరబెల్లా, ధర:రూ. 3,250, జ్యూలరీ: బ్రాండ్ : డ్రిప్ ప్రాజెక్ట్, నెక్ పీస్ ధర:
రూ. 7,999, బ్రాస్‌లెట్ ధర: రూ. 3,999
జ్యులరీ ఏమీ లేవా? ఆందోళన పడొద్దు. మీ డ్రాయర్‌లో ఎక్కడో పడేసిన మగవాళ్ల లింక్డ్–అప్ చైన్‌ను బయటకు తీయండి. అదే ఈరోజు మీ స్టేట్‌మెంట్ పీస్. ఔను, ఇది చాలాకాలంగా మగవాళ్ల జ్యూలరీగా చెప్పుకుంటోంది. కానీ ఫ్యాషన్‌లో జెండర్ అంటే కేవలం లేబుల్ మాత్రమే. ఒక్కసారి ఈ సిల్వర్ లింక్డ్ చైన్ మెడపై వేసుకున్న వెంటనే, మీరు బాస్–లెవల్ వైబ్‌కి షిఫ్ట్ అవుతారు.
పైగా ఈ చన్‌కి డాలర్ లేకపోవడం అంటే బోరింగ్ కాదు – అదే దీని అసలైన మినిమల్ ఆటిట్యూడ్. చేతికి సిల్వర్ స్ట్రాప్ వాచ్ లేదా బ్రేస్‌లెట్ వేసుకుంటే, లుక్‌కి ఫుల్ కాంప్లిమెంట్. ఆఫ్–షోల్డర్ టాప్స్, ఓవర్‌సైజ్ షర్ట్స్, లెదర్ జాకెట్స్ లేదా ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ దాదాపు వెస్ట్రన్ దుస్తులన్నింటితో ఇది సూపర్‌గా సెట్ అవుతుంది. రూల్ మాత్రం క్లియర్.
దీని పక్కన మరో నెక్లెస్ వేసుకోవద్దు. జుట్టు పోనీటెయిల్ వేసుకుంటే బాస్ లేడీ లుక్, లూజ్ వేవ్స్‌లో వదిలేస్తే క్యాజువల్ డే అండర్ కంట్రోల్ అనే ఫీలింగ్ ఇస్తుంది. మొత్తానికి, ఈ లింక్డ్ చైన్ సాదాసీదా చైన్ అనిపించొచ్చు, కాని, స్టయిల్ మాత్రం కాన్ఫిడెన్స్‌ను అమాంతం పెంచే ఆర్నమెంటల్ మేజిక్!.
(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!)