అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్‌కు గత నెల అక్టోబర్ 31 ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన తెలిసిందే. కొందరు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల మ్య ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అల్లు శిరీస్ తెల్లటి షేర్వానితోపాటు ధరించిన చోకర్ చాలా హాట్‌టాపిక్ మారడమే కాదు..వేడుకలో హైలెట్‌గా కనిపించింది. ఆ ఆభరణం హీరో శిరీష్‌కు అందమివ్వడమే కాదు..మగవాళ్లు కూడా ఆభరణాలు ధరించొచ్చా..లేక ఇది సరికొత్త ట్రెండ్‌నా అనే చర్చలకు దారితీసింది. అదీకాకుండా ఒకపక్క ఈ చోకర్ ధరించినందుకు శిరీష్‌పై సోషల్‌మీడియాలో తెగ మీమ్స్ వెల్లువెత్తాయి కూడా. దీనిపై శిరీష్ కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ఇలా మగవాళ్లు ఆభరణాలు ధరించడం అనేది లేటెస్ట్ ట్రెండ్ కానేకాదు. మరచిపోతున్న మన మూలాలను ఒక రకంగా నటుడు శిరీష్ గుర్తుచేశారనే చెప్పొచ్చు. మన సంస్కృతిలో భాగమైన ఆ ట్రెండ్‌కి సంబంధించిన విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!.
భారతీయ మహారాజులు, మొఘల్ పాలకులు చోకర్లు ధరించేవారు. అంతేగాదు ఆభరణాలనేవి కేవలం ఆడవాళ్లకే సొంతం కాదు. మగవాళ్లు ధరించిన అత్యద్భుతమైన ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే బ్రిటిష్ వాళ్ల పాలనాంతరం మన సంస్కృతిని మర్చిపోయాం అని చెప్పొచ్చు. నిజానికి ఇది సరొకొత్త ట్రెండ్ కాదు. రాజుల కాలం నుంచి మగవాళ్లు ఆభరణాలు ధరించేవారు.
వాళ్లు ఆ కాలంలో అత్యంత విలక్షణమైనవి, ఖరీదైనవి ధరించేవారట. అంతేగాదు ప్రపంచంలో అత్యంత విలువైన ఆభరణాల్లో ఒకటైన "ఖిరాజ్-ఇ-ఆలం" లేదా తైమూర్ రూబీ ఒక చోకర్‌ని షాజహాన్ ధరించనట్లు చరిత్ర చెబుతోంది. అది ఏకంగా 352 క్యారెట్ల బరువుతో అత్యంత ఖరీదైన ఆభరణమని కూడా చరిత్రకారులు చెబుతున్నారు.
ఆయన తర్వాత మహారాజా షేర్ సింగ్ ధరించినట్లు చరిత్ర పేర్కొంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దానిని దొంగలించి 1851లో విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతేగాదు, మన చరిత్రను ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే.. మహారాష్ట్ర మరాఠా రాజులు, మైసూరు రాజులు, రాజస్థాన్ రాజులు కూడా వజ్రాలతో పొదిగిన అత్యంత విలాసవంతమైన ఆభరణాలు ధరించనట్లు ఆధారాలు ఉన్నాయి కూడా.
ఆ కాలంలో మగవాళ్లు, ఆడవాళ్లు అనే తారతమ్యం లేకుండా చాలా విలాసవంతమైన ఆభరణాలు ధరించేవారు. రాను రాను పాశ్చాత్య సంస్కృతిని ఒట్టబట్టించుకుని, ధరించే బట్టలు కురచగా అయిపోయాయి..దాంతోపాటు ఆభరణాలను ధరించడం మానేశాం. మళ్లీ నటుడు శిరీష్ పుణ్యమా అని మన మూలాలు, మన గత సంస్కృతి వైభవం స్మతి పథంలోకి తెచ్చిందని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు.
ఇదేమి నవ్వుకునే ఫ్యాషన్ శైలి కాదు. ఇలా మగవాళ్లు ఆభరణాలను ధరించడం అనేది మన సంప్రదాయంలో భాగమైన పురాతన స్టైల్‌గా అభివర్ణిస్తున్నారు ఫ్యాషన్ ప్రియులు. సో నచ్చితే..ఈ ట్రెండ్‌ని సరదాగా ట్రై చేయండి. ఒకరకంగా ఈ స్టైల్‌తో..మన సంస్కృతిని గౌరవించిన వాళ్లం అవ్వడమే కాకుండా..భవిష్యత్తుతరాలకు తెలియజేసినట్లు అవుతుంది కూడా.. కదూ..!.
"Chokers are only for women", is a very western construct. Its 2025 & high time we break free from such limiting beliefs and fully embrace our Indian style jewellery. pic.twitter.com/S1ljwMAp15
— Allu Sirish (@AlluSirish) November 10, 2025
(చదవండి: Drones used for election surveillance: 'పోలింగ్‌పై నిఘా'..పెళ్లి వేడుకల్లో పాగా..)


