
ఎంబ్రాయిడరీ చేసిన మ్యాచింగ్ బెల్ట్‌లు డ్రెస్‌ను అందంగా చూపుతాయి. దీంతో వడ్డాణాల స్థానంలో రకరకాల మోడల్స్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ బెల్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్స్ అంతటితో ఆగి΄ోకుండా మరింత ఉపయుక్తంగా, అందంగా పర్స్ బెల్ట్‌లను డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు. శారీ, లెహంగా, ఏ డ్రస్ అయినా అదే మెటీరియల్‌తో డిజైన్ చేసే పర్సుల బెల్ట్‌లు అదీ మ్యాచింగ్‌తో వాడటం వేడుకలలోనూ హైలైట్ అవుతున్నాయి.
ముస్తాబు పూర్తయ్యాక వేడుకకు వెళ్లే ముందు ఫోన్, డబ్బులు పెట్టుకోవడానికి ΄పాట్లి బ్యాగ్స్, క్లచెస్.. వంటివి వెతుకుతుంటారు. అవి కూడా డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేవి ఉంటే బాగుండేది అని కొందరు, అదనంగా వీటిని పట్టుకెళ్లడం కష్టమే అని విసుక్కునే వారూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా బెల్ట్ పర్సుల మోడళ్లు అందంగా ఆకట్టుకుంటున్నాయి.
టాప్ టు బాటమ్
పాట్లి, ఇతర హ్యాండ్ బ్యాగ్స్ ధరించే డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయడం కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. వీటివల్ల విడిగా హ్యాండ్ బ్యాగ్, పర్సులను కొనుగోలు చేయనక్కర్లేదు. ఒకే రంగు, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి డ్రెస్‌తోపాటు బ్యాగ్‌నూ రూపొందించుకోవచ్చు.
వేడుకలలోనే కాదు క్యాజువల్‌గానూ కలర్‌ఫుల్‌గా వెలిగిపోవచ్చు. నడుముకు పర్స్ ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్‌తో బెల్ట్, దానికి జత చేసిన పర్స్ ఈ బెల్ట్ స్పెషల్. లెహంగా, శారీ, డ్రెస్ ఏదైనా అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. లేసులు, టాజిల్స్, పూసలు, స్టోన్స్... ఈ పర్సులకు జత చేయడం అదనపు ఆకర్షణ.
(చదవండి: అమ్మ అలా చెప్పి ఉండకపోతే ఇలా ఉండేవాడిని కాను: అమిర్ ఖాన్)