
గ్లోబల్ ఇండియా కోచర్ వీక్‌లో హరీష్ అక్కిసెట్టి షో
ఇండియన్ బ్రైడల్, కోచర్ ఫ్యాషన్‌లో సరికొత్త గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: గ్లోబల్ ఇండియా కోచర్ వీక్‌లో భాగంగా నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ హరీష్ అక్కిసెట్టి ప్రదర్శించిన సరికొత్త కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ బ్రైడల్, కోచర్ ఫ్యాషన్‌లో ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ హరీష్ కలెక్షన్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించింది. ఈ సందర్భంగా డిజైనర్ హరీష్ అక్కిసెట్టి మాట్లాడుతూ.. టైమ్స్ ఫ్యాషన్ వీక్, ఇండియా ఫ్యాషన్ వీక్ లండన్ వరుసలో ప్రస్తుత గ్లోబల్ ఇండియా కోచర్ వీక్ కూడా హైదరాబాద్ డిజైనింగ్ వైభవాన్ని గ్లోబల్ వేదికగా ప్రదర్శించే అవకాశం కలిగిందని అన్నారు. వెడ్డింగ్ ట్రౌస్సో లైన్‌తో ఈ కలెక్షన్‌ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలో వాకింగ్ చేస్తూ, బ్యాక్‌స్టేజ్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న డిజైనర్లతో ప్రయాణం చేసి నగరంలో వినూత్న డిజైనింగ్ స్టైలింగ్ అందించడం కోసం లేబుల్ ప్రారంభించానని హరీష్ వివరించారు.
మ్యూజియం జ్యువెలరీ కలెక్షన్
ఈ నెల 18 వరకూ అందుబాటులో ప్రదర్శన
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ భారతదేశపు తొలి లగ్జరీ జ్యువెలరీ మ్యూజియం కలెక్షన్ ప్రదర్శన జూబ్లీహిల్స్‌లో ఏర్పాటైంది. నగరానికి చెందిన వేగ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించిన ఈ ప్రదర్శన అక్టోబర్ 18 వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన డా.సీహెచ్.ప్రీతిరెడ్డి, ఫిక్కీ ఎఫ్ ఎల్ ఓ చైర్‌పర్సన్ ప్రతిభా కుందా, ప్రముఖ నటి తేజస్వి మదివాడ, మాల్వి మల్హోత్రా, ప్రాంతికా దాస్ తదితర నగర ప్రముఖులు పాల్గొన్నారు.