
ఒకప్పుడు హిందూ సంప్రదాయంలో భాగమైన ఆ ఆచారమే ఇవాళ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. బహుశా సాధారణ వ్యక్తులు ఆచారంగా చేస్తే..అతి పెద్ద ఫ్యాషన్ కాదు. అదే ఏ సెలబ్రిటీనో లేక పెద్ద స్టారో ట్రెడిషన్‌ని అనుసరిస్తే..అది స్టైలిష్ యాక్సెసరీగా మారిపోతుంది. అందుకు ఉదాహరణ ఈ కాలా ధాగా. ఏంటిది అనుకుంటున్నారా..?
అదేనండి మన సినీ ప్రముఖులు, పెద్ద స్టార్‌లు, సెలబ్రిటీల చేతి మణికట్టు వద్ద స్టైలిష్‌గా ఓ నల్లదారం కనిపిస్తుందే దాన్నే హిందీలో కాలా ధాగా అంటారు. సాధారణంగా ఏ కాశీ క్షేత్రానికో, తిరుపతి వంటి పుణ్య కేత్రాలకు వెళ్లినప్పుడూ అక్కడ ఉండే మార్కెట్లో ఈ నల్ల తాడులనే కాశీ తాడులుగా దర్శనమిస్తుంటాయి.
ఆయా క్షేత్ర సందర్శనం అనంతరం ఇంటికి చేరుకుని తమ బంధువులకు, స్నేహితులకు ప్రసాదం తోపాటుగా ఈ కాశీతాడుల, ఎరుపు రంగు తాడులను ఇస్తుంటారు. వీటిని రక్షగా ధరిస్తుంటారు. అలాంటి తాడే ఈ కాలా ధాగా. మన హిందూ సంప్రదాయంలో దీన్ని చెడు దృష్టికి రక్షగా ధరిస్తారు. దీన్ని ధరిస్తే కనుదిష్టి పోతుందని భక్తుల నమ్మకం. అది నేడు ఈ ఐటీ గర్ల్స్ పుణ్యామా అని ఫ్యాషన్ యాక్సెసరీగా మారింది.
మరి ఈ కాలా ధాగాను ధరించే సెలబ్రిటీలు ఎవరంటే..
ఈ సెలబ్రిటీలు ఈ సంప్రదాయన్ని ధైర్యంగా పాటించడమే కాదు, రెడ్ కార్పెట్ వద్ద అయినా, లేదా వాళ్ల వర్క్ పరంగా స్టైలిష్ కనిపించాల్సి వచ్చినా చేతికి ఈ కాలాధాగా ఉండాల్సిందే. అంతలా ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.
సిగ్నేచర్ లుక్‌గా..
నల్లదారం లేకుండా కనిపించని నటి ఎవరైనా ఉన్నారంటే అది జాన్వీకపూర్. ఆమె రెడ్ కార్పెట్ లుక్స్ లేదా క్యాజువల్ వార్డ్ రోబ్ అయినా ఈ కాలా ధాగా ఉండాల్సిందేనట. ఇది లేకుండా కనపించదు. సరికొత్త ఫ్యాషన్ వేర్‌లో ఉన్నా..ఇది మణికట్టుకి ఉండాల్సిందేనట.
అనన్య పాండే సైతం దీన్న ధరిస్తుందట. ఇటీవల ఈ జెన్ జెడ్ ఐకాన్ హనుమాన్ ఆలయంలో కనిపించారు. ఆమె అందమైన పసుపు సల్వార్ సూట్ తోపాటు ఈ కాలాధాగాను కూడా జత చేసింది.
కేవలం బాలీవుడ్ నటులే కాదు అంబానీలు కూడా ఈ పవిత్ర నల్లదారాన్ని గట్టిగా విశ్వసిస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే రాధిక మర్చంట్ తన పెళ్లికూతరు లుక్స్‌లో ఈ థ్రెడ్‌తో స్టైలిష్‌గా కనిపించింది. ఇక ఇషా అంబానీ సైతం దీన్ని ధరిస్తారు.
ఈ సంప్రదాయన్ని వాళ్లంతా తన రొటీన్ జీవితంలో భాగం చేసుకునేలా ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఉండగా ఉండగా..ఇది కాస్తా అదెదో ఫ్యాషన్ ట్రెండ్‌లా మారిపోతుందేమో!.
(చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..)