
చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న సినిమా ‘సయ్యారా’ (Saiyaara). మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అహాన్ పాండే సంగీతకారుడు క్రిష్‌కపూర్‌గా, హీరోయిన్‌గా అనీత్ పద్దా ఆశావహ జర్నలిస్ట్ వాణి బాత్రాగా నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ ప్రేమ కథ ఇది. ఇందులో వాణిబాత్రా పాత్రలో ఒదిగిపోయిన 22 ఏళ్ల అనిత అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు చూపిస్తాడు దర్శకుడు. ఆ వ్యాధి కారణంగా వాణి క్రిష్ మద్య సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని చుట్టూ సాగుతుంది ఈ సినిమా. అయితే ఆ సినిమాలో హీరోయిన్ మాదిరిగా చిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి బారినపడతామా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఇది 60 ఏళ్లు పైబడ్డాక వచ్చే వ్యాధి. మరి చిన్నవయసులోనే ఈ వ్యాధిబారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయా అంటే..
సినిమా కాబట్టి అలా కథ కోసం హీరోయిన్ చిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి బారినపడినట్లు చూపించారా..? లేక వాస్తవికంగానే అది నిజమా అంటే..ఔననే చెబుతున్నారు నిపుణులు. ఈ అల్జీమర్స్ వ్యాధి 65 ఏళ్లు పైబడిన వారికి వచ్చినప్పటికీ..కొన్నిసార్లు 30 లేదా 40 ఏళ్ల వారిని కూడా ప్రభావితం చేస్తుందట.
అయితే 20 ఏళ్లలోపు వ్యక్తుల్లో మాత్రం అరుదుగా కనిపిస్తుందని చెప్పారు. తక్కువ వయసులోనే ఈ సమస్య బారినపడిన వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. ఇది జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందట. ప్రధానంగా APP TSEN వంటి జన్యువులలో ఉత్పరివర్తనల కారణంగా చిన్న వయసులోనే ఆ వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఆ మూవీలో వాణి పాత్రలో ఒదిగిపోయిన హీరోయిన్‌లా అపస్మారక స్థితి, తలతిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవని అన్నారు. పైగా ఈ లక్షణాలు అల్జీమర్స్ వ్యాధిలో భాగం కాదని కూడా చెప్పారు.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ఇటీవలే జరిగిన సంభాషణలు లేదా సంఘటనలు మర్చిపోవడం
వస్తువులను తప్పుగా ఐడెంటిఫై చేయడం
ఒక ప్రదేశం లేదా వస్తువుల పేర్లను మర్చిపోవడం
ఆలోచించడంలో ఇబ్బంది పడటం
పదేపదే ప్రశ్నించడం
కొత్త విషయాలను ప్రయత్నించడానికి సంకోచించడం
నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం
అలాగే ఆ సినిమాలో తన భర్తను చూడగానే వాణి తన వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకుంటున్నట్లు చూపించారు. కానీ రియల్‌గా అలా జరగదు. అంత స్పీడ్‌గా రికవరీ కావడం జరగదని చెప్పుకొచ్చారు నిపుణులు. వృద్ధాప్యంలో వచ్చే చిత్తవైకల్యానికి కారణం డిప్రెషన్ అయితే..చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడటానికి జన్యు సంబంధిత సమస్యలే కారణమని అన్నారు.
పైగా దీన్ని కరెంట్ షాక్‌తో ట్రీట్‌మెంట్ చేయరని కూడా చెప్పారు. అయితే ఈ మూవీ జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని ముందుగా గుర్తించాలనే విషయాన్ని హైలెట్ చేసింది. దీన్ని గనుక గమనించనట్లయితే అల్జీమర్స్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరకమునుపే ఆయా పేషెంట్లను మందులు, కౌన్సిలింగ్‌లతో తర్వితగతిన నయం చేయగలుగుతామని అన్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.