
లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన పింక్‌బాల్ ఈవెంట్‌కి రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ తొలిసారి సహ-అధ్యక్షత వహించారు. అయితే ఈ సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ ధరించినడైమండ్స్, ఎమరాల్డ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డైమండ్స్, పచ్చలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నీతా మరోసారి అద్భుతమైన నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్లెస్ రాయల్ లుక్, చరిత్ర ఏంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది.
నీతా అంబానీ మెడలో అమరిన అందమైన పచ్చలు, ఖరీదైన డైమండ్స్, బంగారంతో తయారు చేసిన ఈ లాంగ్ నెక్లెస్ ఇండోర్ మహారాణి సంయోగిత దేవి ధరించిన నెక్లెస్ నుండి ప్రేరణతో ఆమె గౌరవార్ధం రూపొందించారు. ఇది ఇండోర్ మహారాణికి చెందిన అత్యంత ప్రసిద్ధ నెక్లెస్‌లలో ఒకటి. దీని ప్రేరణతోనే స్వయంగా నీతా అంబానీ డిజైన్ చేసుకోవడం విశేషం. ఆమె వ్యక్తిగతంగా సేకరించి వజ్రాలు, పచ్చలతో దీన్ని తయారు చేయించారు. ఈ నెక్లెస్ మధ్యలో 70-క్యారెట్ల పచ్చ, 40-క్యారెట్ల పియర్ షేప్ డైమండ్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ నెక్లెస్‌లో నిజామి మూలానికి చెందిన 40-క్యారెట్ల రౌండ్ వజ్రం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.
1933లో తొలుత మౌబౌసిన్ రూపొందించారు. సంయోగిత దేవి ధరించిన నెక్లెస్‌లోని రెండు పియర్ ఆకారపు వజ్రాలను 1913లో యూరప్ పర్యటన సందర్భంగా తుకోజీ రావు హోల్కర్ III కొనుగోలు చేశారట.. ఆయన తన భార్య కోసం ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి చౌమెట్ పారిస్ సెలూన్‌ను సందర్శించారు. 46.70 , 46.95 క్యారెట్ల బరువున్న రెండు పియర్ ఆకారపు వజ్రాలతో ఫ్రెంచ్ లావలియర్ శైలిలో సొగసైన నెక్లెస్‌గా రూపొందించారు. ఈ వజ్రాల ధర 1913లో 631,000 ఫ్రాంక్‌లు.ఆ తరువాత ఇవి ఇండోర్ పియర్స్ గా పాపులర్ అయ్యాయి.
బరువైన డైమండ్ రింగ్
అంతేకాదు ప్రముఖ నగల డిజైనర్ జూలియా చాఫ్ ప్రకారం40 క్యారెట్ల పియర్ ఆకారపు సాలిటైర్లు చాలా అరుదు. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడాలేదు. ఆమె నెక్లెస్‌తో పాటు ధరించిన భారీ వజ్రపు ఉంగరం కూడామరో హైలైట్. ఇది చాలా బరువైందని ఇది ధరించాక నీతా అంబానీ వేళ్లు బాగానే ఉన్నాయా అంటూ ఆమె చమత్కరించారంటే ఈ ఉంగరం బరువును ఊహించవచ్చు