
ఢిల్లీ మెట్రోలో ఒక వీడియో మళ్లీ తెగ వైరలవుతోంది. ప్రయాణీకులకు అసౌకర్యం , భద్రతల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మెట్రో రైళ్లు , స్టేషన్లలో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించినప్పటికీ అందమైన సాంప్రదాయ దుస్తులలో ముగ్గురు అమ్మాయిల డ్యాన్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ హిట్ సినిమా ‘హమ్ ఆప్కే హై కౌన్’లోని ‘పెహ్లా పెహ్లా ప్యార్ హై’ అనే సాంగ్‌కు ముగ్గురు అమ్మాయిలు అందంగా డ్యాన్స్ చేశారు. చక్కటి హావభావాలు, అందమైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. చాలా బావుంది అంటూ నెటిజన్లు ప్రశంసించారు. వీడియోను జ్యోతి JSK (hezal_little_dancer) అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండింగ్ అస్సలు మిస్ కావద్దు అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ట్రెడిషన్‌ల్ దుస్తుల్లో భలే అందంగా డ్యాన్స్ చేశారు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇటీవల నవరాత్రి సందర్భంగా, తండ్రీ కూతుళ్ల ఉత్సాహభరితమైన గర్బా డ్యాన్స్‌వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నైషా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆరోగ్యకరమైన వీడియోలో తండ్రి వేడుకల్లో ఆనందంగా స్టెప్పులేయడం అందర్నీ ఆకట్టుకుంది.