
అసలు కంటే నకిలీ ముద్దు ఇదీ ఇవాల్టీ ట్రెండ్. మార్కెట్లో ‘రెప్లికా’ ట్రెండ్ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు ఇబ్బడిముబ్బడిగా నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. డిజైనర్ సారీ అయినా, కోట్ల విలువ చేసే డిజైనర్ డైమండ్ నెక్లెస్ అయినా ఒరిజినల్‌ని మరిపించేలా రెప్లికాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కథనం చదివితే.. ఔరా రెప్లికా అనిపించక మానదు.
ఇక కోట్ల విలువ చేసే డైమండ్ నగలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అంబానీ కుటుంబానికి చెందిన ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ పేరే. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ సందర్బంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ పచ్చలు పొదిగిన ఓ డైమండ్ నక్లెస్ ధరించారు. దాని ఖరీదు రూ.500 కోట్లు . దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట మళ్లీ సందడి చేస్తోంది.
విశేషమేమిటంటే ఈ నెక్లెస్ కి రెప్లికా మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.500కోట్ల విలువచేసే నెక్లెస్, రెప్లికా అంటే కనీసం ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉంటుంది అనుకుంటున్నారా? కానే కాదు, కేవలం రూ.178 కి జైపూర్‌లో అన్‌లైన్ అమ్ముతుండటం విశేషం. దీనిని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
జైపూర్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారి 'నీతా అంబానీజీ నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది’’ అంటూ మార్కెటింగ్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోను ముఖ వ్యాపారవేత్త, RPG ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ హర్ష్ వర్ధన్ గోయెంకా (2024లో) ట్వీట్ చేశారు. "అబ్ క్యా బోలూం! #మార్కెటింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెటిజన్లను ఇది బాగా ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేశారు. తక్కువ ధరలకు లగ్జరీ వస్తువులను రూపొందించడంలో భారతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ 'కాపీ చేయడంలో ఇండియా అత్యుత్తమం' అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, 'ఇందులో తప్పేముంది భయ్యా.. అందరై తమకిష్టమైన ఫ్యాషన్‌ను ధరించడానికి అర్హులు. అందుకు డబ్బు అడ్డు రాకూడదు కదా ' అని, కమెంట్ చేశారు. 'ధన్యవాదాలు, నేను నా భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతిని ఇస్తాను' అని కామెంట్ చేయడం విశేషం. అంతేకాదు నీతా అంబానీ లాగా ఆభరణాలు ధరించాలనే చాలా మంది మహిళల కలలను నెరవేర్చినందుకు ఆ ఆభరణాల వ్యాపారిని ప్రశంసించారు.