
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్‌లోనైనా తన స్వాగ్‌ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్‌ను కాస్త బోల్డ్‌గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్‌ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
క్రిస్టల్ క్రష్!
రాళ్ల నగలు నేటి యువత స్టయిల్‌కి ర్యాప్ సాంగ్‌లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్‌గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి.
డైలీ వేర్‌కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్‌కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్‌మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ.
(చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..)