breaking news
chaithra
-
అవే నా స్టయిల్ ఆఫ్ లవ్: నటి చైత్ర జే ఆచార్
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్లోనైనా తన స్వాగ్‌ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్‌ను కాస్త బోల్డ్‌గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్‌ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్రిస్టల్ క్రష్!రాళ్ల నగలు నేటి యువత స్టయిల్‌కి ర్యాప్ సాంగ్లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్‌గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. డైలీ వేర్‌కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్‌కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ. (చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..) -
మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచాం'
నటి చైత్ర రాయ్ (Chaitra Rai) గుడ్‌న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. 'ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్‌ను మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.సీరియల్స్ నుంచి సినిమాల్లోకి..మీ ప్రేమాభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు కూతురు నిష్క శెట్టి సంతానం. ఇప్పుడా పాపతో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి రానుందన్నమాట! కాగా కన్నడ బ్యూటీ చైత్ర.. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) చదవండి: పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను -
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..! -
Chaithra J Achar: సప్త సాగరాలు దాటి సైడ్-బిలో వేశ్యగా నటించిన హీరోయిన్ (ఫోటోలు)
-
బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..
సాక్షి, మైసూరు: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని ప్రియునితో వెళ్లిపోవడంతో తట్టుకోలేని తండ్రి రోడ్డుపైనే ఆమెపై దాడి చేశాడు. కుమార్తె మెడలో ఉన్న తాళిబొట్టును తెంచివేసి జుట్టు పట్టుకొని తండ్రి ఈడ్చుకెళ్తుండగా జనం అడ్డుకున్నారు. వివరాలు... నంజనగూడు తాలూకాలోని హరతళె గ్రామానికి చెందిన చైత్ర, హల్ళెర గ్రామానికి చెందిన మహేంద్ర సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) యువతి తల్లిదండ్రులు దీనిని అంగీకరించలేదు. దాంతో ప్రేమజంట ఈ నెల 8వ తేదీన ఒక గుడిలో మూడుముళ్లు వేసుకుని, ఆ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటలప్పుడు నంజనగూడుకు రాగా, చైత్ర తండ్రి బవసరాజు నాయక్ అడ్డుకున్నాడు. కుమార్తె మెడలోని తాళిని తెంచి, ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లసాగాడు. చైత్ర కాపాడండి అని అరవడంతో స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తండ్రి నుంచి విడిపించుకుని భర్తను చేరుకుంది. స్థానికుల సహాయంతో ఆమె నంజనగూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తండ్రిపై ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమకు భద్రత కల్పించాలని కోరింది. ఈ తతంగమంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. -
26 ఏళ్లకే జిల్లా జడ్జిగా..
రాయచూరు రూరల్: చదువుకునే వయసులోనే ఆమె ప్రతిభకు పదునుపెట్టి జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగానికి ఎంపికైంది. విజయపుర జిల్లాకు చెందిన చైత్రా కులకర్ణి 26 ఏళ్లకే న్యాయపీఠం అధిష్టించబోతున్నారు. బాగలకోటెలోని ఎస్ఆర్ఎన్ కామర్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వసంత కులకర్ణి కుమార్తె చైత్రా కులకర్ణి విజయపుర జిల్లా ఇండి తాలూకా నందరిగికి చెందినవారు. బాగలకోటెలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ బరగుండి వద్ద మూడేళ్ల పాటు శిక్షణ పొందారు. న్యాయ శాఖలో ఇటీవల 101 జడ్జి ఉద్యోగాల నియమకాలకు జరిగిన పరీక్షలకు 4 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 946 మంది ప్రధాన న్యాయమూర్తి పరీక్షకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలలో 86 మందికిగాను 33 మంది ఎంపిక కాగా వారిలో చైత్రా కులకర్ణి కూడా ఉండడం విశేషం. ఆమె ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మీడియంలోనే విద్యనభ్యసించడం కొసమెరుపు. హైకోర్టులో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టనున్నారు. -
ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి
వలిగొండ (కర్నూలు): ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లా వలిగొండలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన చైత్ర (9) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. అయితే నేడు పిండి మిల్లుకు వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు మిల్లులో పడి మృతి చెందింది. ఈ ఘటన సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


