
నటి చైత్ర రాయ్ (Chaitra Rai) గుడ్‌న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. 'ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్‌ను మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.

సీరియల్స్ నుంచి సినిమాల్లోకి..
మీ ప్రేమాభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు కూతురు నిష్క శెట్టి సంతానం. ఇప్పుడా పాపతో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి రానుందన్నమాట! కాగా కన్నడ బ్యూటీ చైత్ర.. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోనూ యాక్ట్ చేసింది.

చదవండి: పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను