
పెళ్లంటేనే భయమేస్తోందంటోంది హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan). వివాహ సాంప్రదాయాన్ని గౌరవిస్తానని, కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతానని చెప్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ.. పెళ్లి పేరు ఎత్తితేనే నాకు భయం వేస్తోంది. వివాహ పద్ధతిని నేను గౌరవిస్తాను. కానీ, నాకు మాత్రం అది అవసరం లేదనిపిస్తోంది. గతంలో ఒకసారి నేను రిలేషన్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేవరకు వెళ్లాను. కానీ పెళ్లి కాకుండానే ఆ ప్రేమ బంధం ముక్కలైంది.
దత్తత తీసుకుంటా
పెళ్లంటే ఇద్దరు మనుషులు ఏకమవడమే కాదు. భవిష్యత్తును పంచుకోవడం, జీవితాంతం ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం.. ఇలా చాలా ఉంటాయి. పెళ్లంటే ఇష్టం లేదని నేను ఒంటరిగానే మిగిలిపోను. ఎప్పటికైనా తల్లి స్థానాన్ని పొందాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. భవిష్యత్తులో పిల్లల్ని దత్తత తీసుకుంటానేమో.. చెప్పలేం! అప్పుడు నేను సింగిల్ పేరెంట్‌గా మాత్రం వారిని పెంచను. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ కచ్చితంగా అవసరం.
సింగిల్
అలా అని సింగిల్ పేరెంట్స్‌ను నేను తక్కువ చేయడం లేదు. వారిపై నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ప్రస్తుతానికైతే నేను నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ శృతి హాసన్ తను సింగిల్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది.. కాగా శృతి హాసన్ కొన్నేళ్లుగా ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమాయణం నడిపింది. గతేడాది వీరిద్దరూ విడిపోయారు. సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.
చదవండి: 9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వడ్డే నవీన్.. ఇప్పుడేం చేస్తున్నాడు?