
సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ సంపాదిస్తే సరిపోదు, దాన్ని అలాగే కాపాడుకోగలిగాలి. లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా వెండితెరపై కనిపించకుండా పోతారు. టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) విషయంలో ఇదే జరిగింది. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఇతడు చాలా కాలంగా తెలుగు తెరకు కనిపించకుండా పోయాడు.
కెరీర్ అలా మొదలైంది
ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కుమారుడిగా నవీన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కోరుకున్న ప్రియుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా పెళ్లితో నవీన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. చివరగా 2016లో ఎటాక్ చిత్రంలో కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు.
రీఎంట్రీ ఇలా ప్లాన్ చేశాడా?
9 ఏళ్ల తర్వాత ఇతడు విలన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. యాక్టింగ్ సంగతి పక్కనపెడితే నవీన్ నిర్మాతగా మారనున్నాడు. వడ్డే క్రియేషన్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నటుడిగా కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే ఇలా నిర్మాత అవతారం ఎత్తి ట్విస్ట్ ఇచ్చాడంటున్నారు అభిమానులు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో నవీన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.
Vadde Naveen starts his new production house.@vaddecreations 💥 pic.twitter.com/nufRFthfBw
— Cinema Madness 24*7 (@CinemaMadness24) July 10, 2025
చదవండి: ఒక్క సినిమాకు 150 కట్స్.. విడుదలకు ముందే కోర్టు స్టే