
బాలీవుడ్ నిర్మాత, ఫ్యాషన్ ఐకాన్ గౌరీ ఖాన్ దీపావళి పండుగ నేపథ్యంలో జోయా ఆధ్వర్యంలో ఐకానిక్ రూబీ రష్ నెక్లెస్ ఆవిష్కరించింది.
70 క్యారెట్ల మొజాంబిక్ ఎర్ర కెంపులతో నెక్లెస్ లో అందంగా కనిపించింది. 1950లో హాలీవుడ్ దిగ్గజాలు మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ ఇంద్రియాలకు ప్రసిద్ధి చెందిన ఎరుపు రంగు లిప్‌స్టిక్ ప్రేరణతో ఈ రూబీ రష్ డిజైనింగ్ రూపొందించామని జోయా యాజమాన్యం తెలిపింది.
స్త్రీతత్వం, శాశ్వతమైన గ్లామర్‌ను ప్రతిబింబించే ఈ డిజైన్స్ హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. మహిళల సౌందర్యం, ఆత్మస్థైర్యానికే కాకుండా లగ్జరీకి నిదర్శనంగా నిలుస్తుందని గౌరీ ఖాన్ పేర్కొన్నారు