
ఫ్యాషన్: దాండియా ధడక్
నవరాత్రులలో దాండియా ఆటలు గర్భా నృత్యాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేలా ఉంటాయి. ఈ ఆటపాటలలో పాల్గొనే వారు మరింత సౌకర్యంగా ఉండేలా చూపరులకు కనువిందు చేసేలా... ప్రత్యేక డ్రెస్సులూ ఉంటాయి. ముదురు రంగులు, అద్దాల మెరుపులు, ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు, ధోతీ ప్యాంట్స్‌కి ఆధునికపు హంగుల అమరిక ఈ రోజుల్లో ముచ్చట గొలుపుతుంటాయి. నవరాత్రి గర్భా, దాండియా రాత్రుల కోసం ట్రెండీ దుస్తుల ఆలోచనలు నవతరాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వైపుగా నడిపిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌తో అలంకరించిన రంగురంగుల చనియా చోళి దుస్తులను స్టైల్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.
ధోతీ ప్యాంటుతో క్రాప్ టాప్
మిర్రర్,ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్, ధోతీ ప్యాంటు కలయిక కంఫర్ట్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. దాండియా ఆడటానికి అనుకూలంగా ఉండే ఈ డ్రెస్ కాన్ఫిడెన్స్‌నూ ఇస్తుంది. ఫ్యాషన్ లుక్ కోసం ధోతీ ప్యాంటును కొత్త క్రాప్ టాప్‌తో తిరిగి వాడచ్చు.
లెహెంగా అసెమెట్రికల్ కుర్తీ
అసెమెట్రికల్ కుర్తీలు వేడుకలకు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఫ్లేర్డ్ లెహెంగాతో జత చేస్తే చూపుతిప్పుకోలేరు. ఒక డైనమిక్ ఎలిమెంట్‌ను జోడిస్తుంది. పండుగ సీజన్‌లో స్పెషల్ లుక్ కోరుకునేవారికిది బెస్ట్ ఆప్షన్.
ప్యాంటుతో సైడ్ స్లిట్ కుర్తీ
సంప్రదాయ దుస్తులకు ఆధునిక టచ్‌ను ఇష్టపడే వారికి సైడ్ స్లిట్ కుర్తీ సరైన ఎంపిక. ఇది ప్లెయిన్, ఎంబ్రాయిడరీ లేదా బ్రోకేడ్ బోర్డర్‌లతో డిజైన్ చేసిన ప్యాంటుతో, లెహెంగా కాంబినేషన్‌గా ధరించవచ్చు.
లెహెంగాతో మిర్రర్ డెనిమ్ షర్ట్
ఇండో–వెస్ట్రన్ లుక్ కోసం లెహెంగాతో డెనిమ్ షర్ట్‌ను జత చేయచ్చు. ఈ ఇండో–వెస్ట్రన్ లుక్ వివిధ రకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారికి సరైనది. క్లాసిక్ లెహెంగా, క్యాజువల్ డెనిమ్ షర్ట్ మరింత కంఫర్ట్‌గా ఉంటుంది, ఇది నవరాత్రుల్లో ప్రత్యేకంగా చూపుతుంది.
సొంతంగా క్రియేషన్
- పెద్ద పెద్ద జూకాలు, గాజులు, లేయర్డ్ నెక్లెస్‌లు.. జర్మన్ సిల్వర్ జ్యువెలరీని ఎంచుకోవచ్చు నృత్యం చేసే సమయం కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్‌ను ఎంచుకుంటే లుక్ ఫ్రెష్‌గా ఉంటుంది.
- పెద్ద పెద్ద బిందీలు నవరాత్రి రోజులలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పొడవాటి జడలు, వివిధ మోడల్స్‌లో ఉన్న ముడులు, వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ బాగుంటాయి.
- బోహో– ఫ్యూజన్ కాంబినేషన్‌లో డెనిమ్ డ్రెస్‌లు పగటి పూట కూడా ఈ రోజుల్లో క్యాజువల్‌గా ధరించవచ్చు.
- సంవత్సరాలుగా లెహంగాలు, ఘాగ్రాలు నవరాత్రి దుస్తులుగా ఉన్నాయి కాబట్టి స్కర్టులు, కుర్తీల నుండి లేయర్డ్ ఇండో–వెస్ట్రన్ గౌన్ల వరకు ఈ రోజుల్లో ప్రయత్నించవచ్చు. ∙రంగురంగుల టాసెల్స్, రాజస్థానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్‌లు, మిర్రర్ వర్క్ ఉపయోగించి పండగ థీమ్‌ను క్రియేట్ చేయవచ్చు.
- నవరాత్రి స్పెషల్ డ్రెస్సులు దాదాపు రూ.1500/– నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే ఇంట్లోనే డిజైనరీ క్రాప్ టాప్, బ్లౌజ్ లేదా చిన్న కుర్తీతో జత చేయబడిన డెనిమ్ బాటమ్స్ ధరిస్తే డ్యాన్స్ చేసేవారికి తాజా, ఉల్లాసభరితమైన వైబ్‌ను జోడిస్తాయి.
- పండుగ అలంకరణ కోసం దుప్పట్టా లేదా బాందిని స్టోల్ లేదా టై–డై ప్రింట్‌లతో స్టైల్ చేయచ్చు.
- నవరాత్రి ఫ్యాషన్ అనేది వ్యక్తిగత వ్యక్తీకరణతో సంప్రదాయాన్ని కళ్లకు కట్టవచ్చు. వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినా, సొంతంగా తమదైన స్టైల్‌ను క్రియేట్ చేసినా, బోహో–ఫ్యూజన్ డ్రెస్సులు డ్యాన్స్ ఫ్లోర్‌పై హంగామా చేస్తాయి. ఈ పండుగ సీజన్‌లో సాధారణంగా కాకుండా తమదైన సొంత సృజనాత్మకతను సరికొత్తగా పరిచయం చేయచ్చు.
చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!