
చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్‌లో రకరకాల ట్రెండ్‌లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్‌లు అందిస్తున్న సూచనలివి..
లేయరింగ్, స్టాకింగ్..
పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్‌లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్‌లెట్‌లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్ కారకంగా ఉండాలి.
షాండ్లియర్ చెవిపోగులు..
ఈ షాండ్లియర్ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్ షాండ్లియర్స్ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
బోల్డ్ రింగులు..
ఒక పెద్ద డేరింగ్ రింగ్ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్‌లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి.
జడౌ..జతగా..
ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది.
ఆమె..ఆభరణం..
కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు.
ఆఫీస్..డైమండ్ పీస్..
పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్ డైమండ్ హగ్గీలు లేదా సాలిటైర్ స్టడ్‌లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్ ఫార్మల్స్ ధరించడం ఇష్టపడితే, డైమండ్ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్ పోల్కీ ఇయర్ స్టడ్‌తో సరిపెట్టొచ్చు.
(చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)