
హైదరాబాద్ నగరంలో బ్లైండ్ ఫోల్డ్ వర్క్‌షాప్స్ ఊపందుకుంటున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని కుంచెకు పనిచెప్పే చిత్రకారులు సృష్టిస్తున్న చిత్రాలు కళాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే నగరంలో ఆ తరహా చిత్రకళా నైపుణ్యం అందించే వర్క్‌షాప్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని మాదాపూర్‌లో ఉన్న ట్రైలింగ్ ఐవీ కేఫ్ ఆధ్వర్యంలో ఒక వర్క్‌షాప్ జరగనుంది.
ఔత్సాహికులకు బ్‌లైండ్ ఫోల్డ్ ఆర్ట్ మెళకువలను నేర్పేందుకు శనివారం మధ్యాహ్నం 12.గంటలకు ఈ వర్క్‌షాప్ ప్రారంభం కానుంది. దాదాపు 2గంటల పాటు కొనసాగే ఈ కళాశిక్షణపై ఆసక్తి కలిగినవారు బుక్ మై షో ద్వారా ఎంట్రీలు పొందవచ్చు.
(చదవండి: Araku Aroma : హైదరాబాద్ టు యూఎస్..తొలి బ్రాండ్‌గా అరుకు అరోమా..!)