
అరకు కాఫీ రుచిని యునైటెడ్ స్టేట్స్‌కు పరిచయం చేసిన మొదటి బ్రాండ్‌గా అరకు అరోమా నిలిచిందని, హైదరాబాద్ నగరంతో పాటు స్థానిక రుచులను విశ్వవ్యాప్తం చేయడంలో తాము వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అరకు అరోమా వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య తెలిపారు.
క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా ఆధ్వర్యంలో అరకు అరోమా కొత్త కాఫీ బ్లెండ్‌లను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందిన ఈ ఆఫర్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఔత్సాహికులకు సరికొత్త అనుభవాలను అందిస్తాయని అన్నారు. ఈ కొత్త బ్లెండ్‌లలో అరకు అరోమా గ్రీన్ కాఫీ, అరబికా రీగేల్, ఫిల్టర్ కాఫీ, అరబికా ప్రైమ్ ఉన్నాయన్నారు. యూఎస్‌ఏలో రిజిస్టర్డ్ బ్రాండ్ ఉనికితో ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు సేవలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అందర్జాతీయ వంటకాలు.. )