
ఫ్యాషన్ ఉత్పత్తుల అమ్మకాలే అధికం
పండుగ విక్రయాల అధ్యయనం వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ విక్రయాల్లో గృహోపకరణాలు, పురుషుల దుస్తులు, పాదరక్షలు ముందు వరుసలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యాషన్‌కే ఎక్కువ డిమాండ్ ఏర్పడిన విషయాన్ని ప్రముఖ ఆన్‌లైన్ విపణి ఫ్లిప్‌కార్ట్ షాప్సీ అధ్యయనం వెల్లడించింది. గృహావసర వస్తువులకు డిమాండ్ 108% పెరిగిందనీ, పురుషుల సాధారణ దుస్తులు, పాదరక్షల విక్రయాలు 95% పెరిగాయనీ తెలిపింది. మహిళల కుర్తా, ప్యాంట్ సెట్‌లు, ఇయర్‌బడ్స్, పురుషుల అనలాగ్ గడియారాలు అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులుగా నిలిచాయని తేల్చింది.
(చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే)
జెన్ జెడ్‌గా పేర్కొంటున్న నవ యువ తరం ప్రధానంగా గ్రూమింగ్, ఫ్యాషన్, దుస్తులపై దృష్టి పెట్టగా, మిలీనియల్స్ (నేటి తరం) గృహ అవసరాలు, ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం 60% అమ్మకాలకు దోహదపడిందని, మొత్తం ఆర్డర్‌లలో 57%తో మహిళా కొనుగోలుదారులు టాప్‌లో నిలిచారని
వెల్లడించింది.
చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్