
మిస్ ఇండియా ట్యాగ్ ఉన్నా, ఆమె స్టయిల్ మాత్రం ‘హే, నేను మీ పక్కంటి అమ్మాయినే!’ అనే నేచురల్ స్వాగ్‌తో ఉంటుంది. అదే మీనాక్షి చౌదరి మ్యాజిక్! స్కిన్‌కి మేకప్ కంటే, మినిమలిజమే బెస్ట్ ఫిల్టర్ అంటూ, చిన్న చిరునవ్వుతో మెరిసే మీనాక్షి చెప్పిన కొన్ని స్టయిలింగ్, బ్యూటీ సీక్రెట్స్ మీకోసం..
సింపుల్‌గా ఉంటూనే ప్రతి లుక్‌లోనూ ప్రత్యేకతను కోరుకుంటా. అలాగే, మేకప్ కంటే, స్కిన్‌కేర్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. రోజూ నీళ్లు తాగడం, హెల్దీ డైట్, పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేయడం– ఇవే నా బ్యూటీ సీక్రెట్స్. ఎమరాల్డ్ గ్రీన్, రాయల్ బ్లూ, ఫైరీ రెడ్ రంగులు నా ఫేవరెట్. ఇవి వేసుకుంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
– మీనాక్షి చౌదరి.
సింగిల్ కింగ్!
సాంప్రదాయానికి స్టయిలిష్ లుక్ కావాలంటే, స్టేట్‌మెంట్ చోకర్ ఉండాల్సిందే!. ఇది మెడకు ఒక మినీ ఆటిట్యూడ్ ఇచ్చే హారం. సాధారణ చోకర్స్ కంటే వివిధ రకాల పూసలు, రత్నాలతోపాటు వైవిధ్యమైన కళాత్మక డిజైన్స్‌తో ఉంటుంది. చూడటానికి చిన్నదిగా కనిపించినా, దీన్ని వేసుకున్న వెంటనే అద్దం ముందు నాలుగు రౌండ్లు తిరగాల్సిందే! ఎందుకంటే, ఈ హారం మిమ్మల్ని ప్రతి యాంగిల్‌లోనూ చాలా కొత్తగా చూపించగలదు.
దీనిని చీరలతో ధరించాలి అనుకుంటే గాఢమైన ముదురు రంగుల చోకర్స్‌ను ఎంచుకోండి. ఇక ప్లెయిన్ డిజైన్, లైట్ కలర్స్ లెహంగా, కుర్తీలపై కూడా ఇది బాగా నప్పుతుంది. జడ లేదా హై బన్, స్లీకీ బన్ హెయిర్ స్టయిల్‌తో చోకర్స్‌ని మరింత హైలైట్ చేయొచ్చు. అలాగే మేకప్ మినిమమ్ ఉంటే చోకర్ మరింత బ్రైట్‌గా కనిపిస్తుంది.
అయితే, ఈ చోకర్‌ను వేరే హారాలతో కలపకుండా స్టయిలింగ్ చేసుకోవడంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే, ఇది సింగిల్‌గానే రాయల్‌గా కనిపిస్తుంది. అందుకే, ఇది వేసుకున్న వారి వద్దకు ‘అందంగా లేనేమో’ అనే అనుమానం దరిదాపుల్లోకి కూడా రాదు.
జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ధర: రూ. 17,000
చీర బ్రాండ్: జాన్కీ ఇండియా, ధర: రూ. 44,800
బ్లౌజ్ ధర: రూ. 17,000