
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ డెమ్నా లేటెస్ట్ కలెక్షన్ లాంచింగ్ వినూత్నంగా కనిపించింది. తన సాధారణ స్టైల్‌కి భిన్నంగా మిలాన్ ఫ్యాషన్‌వీక్ 2025(Milan FashionWeek)లో అందరి దృష్టినీ అలరించింది. గూచీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ (Gucci global brand ambassador) ఆలియా ఫర్ కోట్‌లో హాట్ లుక్స్‌లో అదరగొట్టింది.
ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ గూచీ క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నాతొలి కలెక్షన్‌ను ప్రదర్శించిన సినిమాటిక్ దృశ్యం ది టైగర్ ప్రత్యేక చలనచిత్ర ప్రదర్శనకు హాజరైంది. బోల్డ్ దుస్తులను పాయింటెడ్-టో బ్లాక్ హీల్స్,టాప్ హ్యాండిల్ , చైన్ స్ట్రాప్‌తో కూడిన చిన్న, స్ట్రక్చర్డ్ బ్లాక్ లెదర్ హ్యాండ్‌బ్యాగ్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత స్పైక్ జోన్జ్ , మేటి దర్శకురాలు హలీనా రీజ్న్ దర్శకత్వం వహించిన ఆకర్షణీయమైన లఘు చిత్రం ‘ది టైగర్’ ప్రీమియర్ ద్వారా గూచీ సినిమా , హై ఫ్యాషన్‌పై తన నిబద్దతను చాటుకుంది. ఈ ప్రీమియర్‌లో ఆలియా గూచి లా ఫామిగ్లియా లెక్షన్‌ను ఆవిష్కరించింది.ఈ సందర్భంగా నెక్‌లైన్‌తో కూడిన మినీ డ్రెస్‌కి ఫాక్స్ ఫర్ కోట్ లుక్ మరింత అందాన్నిచ్చింది. స్టేట్‌మెంట్ GG చెవిపోగులు , గూచీ వెదురు బ్యాగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్.
ఈ సందర్భంగా డిసెంబర్ 25, 2025న విడుదల కానున్న తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆల్ఫా’ గురించి అలియా ఒక అప్‌డేట్‌ను అందించింది. విడుదల గురించి నటి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఇది నా తొలి యాక్షన్ వెంచర్,ప్రేక్షకులు దానితో ఎలా కనెక్ట్ అవుతారో అని ఆసక్తిగా ఉన్నానని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యపై అభిమానులు భిన్నంగా స్పందించారు.ఆలియా ఇప్పటికే జిగ్రా ,హార్ట్ ఆఫ్ స్టోన్‌లో యాక్షన్ సన్నివేశాల్లో నటించిందిగా అని కొంతమంది నెటిజన్లు ప్రతిస్పందించారు.