
డైరెక్టర్ కూతురే అయినా, ఆమెను కెమెరా ముందు నిలిపింది కేవలం తన టాలెంటే! అందుకే, ప్రతిభను నమ్ముకుని ముందుకెళ్లే అదితి శంకర్ అందానికి కారణం కూడా ఆమె ఆత్మవిశ్వాసమేనట!
నాకు బ్యూటీ సీక్రెట్లు ఏవీ లేవు! ప్రతిరోజూ స్నానం చేయడం, బాగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, అంతే! సంప్రదాయ దుస్తులు అంటే ఇష్టం. ముఖ్యంగా చీరల్లో నేను రాణిలా మెరిసిపోతుంటాను. అందుకే ప్రత్యేక సందర్భాల్లో నా మొదటి ఎంపిక చీరలే. ఇవి నాకు అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తాయని అంటోంది అదితి శంకర్. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్ నిరాలీ, ధర రూ. 35,000, జ్యులరీ బ్రాండ్: ఎమిథిస్ట్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
డబుల్ చెయిన్... డబుల్ ఇంపాక్ట్!
ఫంక్షనేమో చిన్నదే కాని, అది చాలా దగ్గరి వారిది. పెద్దగా తయారవకుండానే, ప్రత్యేకంగా కనిపించాలి. అయితే, ఒక్కసారి మెడలో ఈ డబుల్ లేయర్డ్ చెయిన్ వేసుకోండి. తళతళలాడే భారీ నగలు లేకుండానే, ఈ ఒక్క ఆభరణమే అందరి చూపులను ఆకర్షించేలా చేస్తుంది. సింపుల్ అయినా సాఫిస్టికేటెడ్, క్యూట్ అయినా కిల్లర్ లుక్‌కి చిరునామా డబుల్ లేయర్డ్ చెయిన్‌తో అందుకే దీని ప్రభావం కూడా రెట్టింపుగా ఉంటుంది.
అయితే, ఈ హారం వేసుకునేటప్పుడు కొన్ని స్టయిలింగ్ చిట్కాలు గుర్తుంచుకోవాలి. చెయిన్ స్పష్టంగా మెడపై మెరిసిపోవాలంటే వీ–నెక్ లేదా ఓపెన్ నెక్ బ్లౌజ్ ఉండేలా చూసుకోవాలి. పెద్ద చెవిపూసలు వేసుకుంటే ఈ చెయి తో పోటీ పడతాయి. అందుకే చిన్న స్టడ్స్ లేదా చిన్ని జుమ్కీలు సరిపోతాయి.
చేతికి తక్కువ గాజులు, ముఖానికి మినిమల్ మేకప్ అంతే, సిద్ధం! జుట్టు విషయంలో కూడా సహజంగా వదిలిన లైట్ కర్ల్స్ ఉంటే మెడ బాగా కనిపిస్తుంది, చెయిన్ మరింత మెరిసిపోతుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిన్న డబుల్ చెయన్‌తో మీ లుక్‌కి ఒక డబుల్ ఇంపాక్ట్ గ్యారంటీ!.
డ్రెస్..
బ్రాండ్: నిరాలీ
ధర:
రూ. 35,000
జ్యూలరీ:
బ్రాండ్ : ఎమిథిస్ట్
ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.