
ముఖం, మెడపై అవాంఛిత రోమాలుంటే ఏ మేకప్ వేసుకున్నా వృథానే అనిపిస్తుంది. ఇక కాళ్లు, చేతుల మీద వెంట్రుకలు పెరిగితే నచ్చిన డ్రెస్‌లు కూడా వేసుకోలేం. అన్నింటికీ ఒకటే పరిష్కారం అవాంఛిత రోమాలను తొలగించడం. అందుకోసం హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడుకోవడం లేదా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు చాలామంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ డివైస్.
నిమిషానికి 120 ఫ్లాష్‌లతో ఈ మెషిన్ పని చేస్తుంది. 12 వారాల పాటు దీనితో ట్రీట్‌మెంట్ అందుకుంటే తర్వాత మంచి ఫలితాలుంటాయి. దీనికి పవర్ కేబుల్‌తో పాటు నాలుగు ప్లగ్ అడాప్టర్స్ లభిస్తాయి. మొదటిగా వెంట్రుకలను ట్రిమ్ చేసుకుని, అనంతరం ఈ డివైస్ లైట్ ఫ్లాష్‌లను తీసుకుంటే ఆ భాగంలో రోమాలు మటుమాయం అవుతాయి.
ఈ గాడ్జెట్ వెంట్రుకలను లోతుగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీని లైట్ టెక్నాలజీ వెంట్రుకల కుదుళ్లను లక్ష్యంగా చేసుకుని, వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ ఎపిలేటర్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు.
దీనిలో చర్మాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది. ఈ మెషిన్ సున్నితంగా ఉండేలా సిలికాన్ రక్షక కవచంతో రూపొందింది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ డివైస్‌ల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే మోడల్‌లో ఫ్లాష్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఎక్స్‌ట్రా ఆప్షన్స్‌ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు.
(చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!)