
అందమంతా పోతపోసుకున్నట్లు కనువిందు చేసే మాయ పేరే మృణాళిని రవి. సోషల్ మీడియాలో రీల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై రియల్‌గా కనిపించడంలోనే కాదు, ఫ్యాషన్‌లోనూ స్టయిలిష్‌గా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాటు ఒక్కటి చాలు మీ అందాన్ని మరింత పెంచడానికి. రోజూ పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఆ అలవాటే నా అందానికి సహజత్వాన్ని ఇస్తుందని చెబుతోంది మృణాళిని రవి.
రాయల్ రింగ్..
సాధారణ దుస్తుల్లో కూడా రాయల్‌గా కనిపించాలంటే.. మీ దగ్గర తప్పకుండా ఒక్కటైనా స్టేట్‌మెంట్ రింగ్ ఉండాల్సిందే! అది చిన్నదైనా, పెద్దదైనా సరే, మొత్తం మీ లుక్‌కే ఒక ప్రత్యేకమైన ఎలిగెన్స్‌ను ఇవ్వగలదు. ఇవి ఎక్కువగా వివిధ ఆకారాలు, రంగులు, స్టోన్స్‌తో ప్రత్యేకమైన డిజైన్స్‌లో ఉంటాయి. స్టేట్‌మెంట్ రింగ్ వేసుకున్నప్పుడు చేతికి వేరే ఏ ఇతర ఆభరణాలతోనూ స్టయిలింగ్ చేయొద్దు.
ఎక్కువ రింగ్స్ వేసుకుంటే ఫోకస్ చెదిరిపోతుంది. మంచి నెయిల్ పాలిష్‌తో జత కలిపితే ఉంగరం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మ్యూట్ షేడ్స్ లేదా డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే కలర్స్ ఉపయోగించండి. లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్‌లు, టాప్‌లు అసలు వేసుకోవద్దు. అలాగే హ్యాండ్‌బ్యాగ్‌కు బదులు క్లచ్ తీసుకెళ్లడం ఉత్తమం.
(చదవండి: ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!)
ఇక కాంప్లిమెంటరీ జ్యూలరీగా కమ్మలను చూజ్ చేసుకోండి. అవికూడా మితంగా, సేమ్ టోన్ జ్యూలరీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోషూట్స్, వివాహాది శుభకార్యాలకు సింపుల్ అండ్ గ్రేట్ ఆప్షన్ ఇది. అప్పుడు అక్కడ మీరు మాట్లాడకపోయినా సరే, మీ స్టయిల్ మాట్లాడుతుంది. ఇక మృణాళిని ధరించే జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ఇయర్ రింగ్స్ ధర: రూ. 33,200, ఉంగరం ధర: రూ. 2,200, చీర బ్రాండ్: ఆలివ్ హ్యాండ్‌ప్రింట్స్ రూ. 3,850/-.బ్లౌజ్ ధర: రూ. 1,050/-.
(చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!)