
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్‌ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్‌లోనూ తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్‌క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి.
చెవి కప్పేస్తే కళ్లకందం
దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్‌లాగా సపరేట్‌గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్‌తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ.
వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి.
అంటే చేతికి మీ డ్రెస్‌కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్‌ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్‌లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికా
ధర రూ. 6,500/-.
(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..)