
ఫరెవర్ మిసెస్ ఇండియా 2025 హైదరాబాద్ విజేతగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన బంగ్లా చంద్రలేఖ నిలిచారు. జైపూర్ జీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరల్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. షారా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవస్థాపకురాలిగా వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ, కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్‌గా రాణిస్తూనే ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. నటన, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్‌లో అడుగు పెట్టాను. నా ఇష్టాలకు కుటుంబ సభ్యుల సహకారం తోడైందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు.
అందం, ఆత్మస్థైర్యం
హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్‌కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్, మిసెస్ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్‌కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 సీజన్ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు.
ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ లీడర్‌గా, ఈవెంట్స్, ఎచ్‌ఆర్, సీఎస్‌ఆర్ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. టీఎస్‌ఈ8 ఉమెన్స్ అచీవ్‌మెంట్ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్‌స్టా్రగామ్
ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
(చదవండి: International Youth Day: విజయకేతనం ఎగరేసిన ధీర యువత..!)