తెల్లని కాగితం మీద రాసే అక్షరమాల వేడుకలలో ఆధునిక మహిళల అలంకరణగా ఆకట్టుకుంటోంది.పెళ్లి, పుట్టినరోజు, సీమంతం.. వేడుకకు తగినట్టు తమ ప్రియమైన వారి పేర్లు హెయిర్ యాక్సెసరీస్‌లలోనూ, గాజులు, ఇతర ఆభరణాలలోనూ వచ్చేటట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు.
సాధారణంగా చిన్నపిల్లల కేశాలంకరణలో నేమ్ క్లిప్స్ చూస్తుంటాం. ఇప్పుడు వెస్ట్రన్ లేదా ఇండియన్ వేడుకలకు తగినట్టు అన్ని వయసుల వారు తమ కేశాలంకరణలోనూ, ఇతర ఆభరణాలలోనూ అక్షరమాలను అందంగా కూర్చుతున్నారు.
నెక్లెస్... హ్యాంగింగ్స్ గానూ...
చెవులకు జూకాలు, మెడన హారాలలో తమ ప్రియమైన వారి పేర్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. వేడుక అర్థం తెలిసేలా కూడా అక్షరాలమాలను ధరిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, థ్రెడ్ జ్యువెలరీలలో సందర్భానికి తగిన అక్షరాలు కనిపిస్తుంటాయి. హల్దీ, మెహెందీ వివాహ వేడుకలలో వధూవరుల పేర్లు కలిసివచ్చేలా డిజైన్ చేసిన ఆభరణాలను కొత్త పెళ్లికూతురు ధరిస్తుండటం కనిపిస్తోంది.
కేశాల అలంకరణలో...
ఎ నుంచి జెడ్ వరకు ఇంగ్లిష్ అక్షరాలతో తయారు చేసిన వివిధ లోహపు, బీడ్స్ హెయిర్ జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. వరుడి పేరు వచ్చేలా లేదా సందర్భానికి తగిన అర్థం వచ్చేలా, ఫన్‌ని క్రియేట్ చేసే విధంగానూ అక్షరాలను తలకెక్కించుకుంటున్నారు. వీటిలో స్వరోస్కి, గోల్డ్, ఎంబ్రాయిడరీ, వివిధరకాల పూసల అందాలు అక్షరాల చుట్టూ చేరుతున్నాయి. జడ ΄÷డవును బట్టి కూడా లోహపు అక్షరాల క్లిప్స్ వేల రూ΄ాయల ధర పలుకుతున్నాయి.
గాజుల్లో..
డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా రంగు రంగులతో ఉండే చిన్నా పెద్ద గాజుల ఎంపిక సాధారణమే. అయితే వేడుకలలో మాత్రం స్పెషల్‌గా కనిపించేలా అమ్మాయిలు తమ పేర్లతో తయారు చేయించుకున్న గాజులను ధరిస్తున్నారు. వీటి డిజైన్‌కి ఆర్డర్‌పై కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చేయించుకోవడంపై బాగా ఆసక్తి చూపుతున్నారు.
వివిధ భాషలలో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవాలి అంటే అందుకు తగిన జ్యువెలరీ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ఆన్‌లైన్ ΄ోర్టల్స్ బాగా సహాయపడుతున్నాయి. అల్ఫాబెట్ అక్షరాల మాల క్లిప్పుల సెట్ వందల రూ΄ాయల నుంచి నాణ్యత, డిజైన్‌ను బట్టి వేల రూ΄ాయల వరకు ధర పలుకుతోంది.
(చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్‌గా ఉంటోంది..!)


