
ప్రముఖ నటి విద్యాబాలన్ సడెన్‌గా తన లుక్‌ను మార్చేసింది. బాలీవుడ్‌లో విలక్షణ నటిగా, ఒక ఐకాన్‌గా పేరుతెచ్చుకున్న నటి యంగ్ , డైనమిక్‌లో అభిమానులనుఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది. తన స్టైలిష్ ఫోటోలను విద్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.
విద్యాబాలన్ బాలీవుడ్ ఐకానిక్ నటిగా తనకంటూ పేరు సంపాదించుకున్నారు. సినిమా ప్రమోషన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మ్యాగజైన్ కవర్లైనా, విద్యాబాలన్ చేనేత వస్త్రాలు ఆమె స్పెషల్టీ. కానీ ఆమె తాజా లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది .
విద్యాబాలన్ 'ఐటీ' కవర్ గర్ల్
ది పీకాక్ మ్యాగజైన్ జూలై -2025 ఎడిషన్ కవర్ షూట్ కోసం విద్యాబాలన్ తన అద్భుతమైన పరివర్తనతో అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యాబాలన్‌కు సంబంధించిన స్టైలిష్ ఫోటోలను 'ఎ ఫోర్స్ టు రెకౌన్ విత్' అనే శీర్షికతో మ్యాగజైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అద్భుతంగా ఉంది అని ఒకరు "కాంజీవరం చీర లుక్ నుండి - ఇప్పుడు ఇది! మైండ్ బ్లోయింగ్...మాటలు లేవు" అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ఇది ఏఐ ఫోటో కాదు అంటూ కొనియాడడం గమనార్హం.

కాగా 2003 వ సంవత్సరం లో ‘బాలో టేకో’ అనే బెంగాలీ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె ‘పరిణీత’ అనే చిత్రంతో హీరోయిన్ గా మారడమేకాదు, ఫ్యాన్ ఫాలోయింగ్‌నుసంపాదించుకుంది, దర్శక నిర్మాతల చాయిస్‌గా మారిపోయింది. ఇటీవల భారీగా బరువు తగ్గి 46 ఏళ్ల వయసులో మరింత అందంగా మారిపోయిన సంగతి తెలిసిందే.