
పువ్వులకు మగువలకు విడదీయరాని బంధం ఉంటుంది. పువ్వులను తమ భుజాల మీదుగా మణికట్టు వరకు అలంకరించుకుని అందంగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్ గౌన్లలో విరివిగా కనిపించే ఈ స్టైలు ఇప్పుడు ఎల్లలు దాటి మన సంప్రదాయ డిజైనర్ వేర్‌లోనూ కనువిందు చేస్తోంది. ఫ్యాబ్రిక్‌తో పువ్వులు వచ్చేలా కుట్టడం ఈ స్టైల్ ప్రత్యేకత. ఇక పువ్వులు చేతుల్లో కాదు, చేతులకు అందంగా అలంకరించుకోవచ్చు.
పింక్, పీచ్ కలర్ బ్లౌజ్ అయితే ఫెమినైన్ లుక్, రెడ్ కలర్ అయితే స్టేట్‌మెంట్ అటైర్‌గా, తెలుపు, గోధుమరంగు అయితే వేదికలపైన పల్లకీ లుక్‌తో కనిపిస్తారు. ఏ స్టైల్‌లో కనిపించాలనుకుంటే ఆ డ్రెస్సింగ్‌కి సరిగ్గా నప్పే ఈ గులాబీల గుచ్చాలు ప్రత్యేకంగా కనిపించడమే కాదు, ఫొటోలలోనూ విలాసంగా ఉంటుందనే ఆలోచన కూడా దీనికి క్రేజ్ పెంచుతోంది. నిన్నటి వరకు పిల్లల డ్రెస్సింగ్‌లో కనిపించే ఈ స్టైల్ పెద్దవారి చీరకట్టుకూ అందాన్ని తీసుకువచ్చింది. రిసెప్షన్, సంగీత్.. వంటి వేడుకలలో గ్రాండ్‌గా వెలుగుతోంది.
స్లీవ్స్ డిజైన్ బోల్డ్‌గా ఉంటే, నెక్ సింపుల్‌గా ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఆభరణాలు కాకుండా సన్నని చైన్లు వాడచ్చు.
గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం ఈ స్టైల్ స్పెషల్. ఈ పువ్వులు లేయర్లుగా మంచి ఫ్లేర్ వచ్చేలా డిజైన్ చేస్తారు. వీటిని ఎక్కువగా నెట్, ఆర్గాంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్‌తో తయారు చేస్తారు.
ఇండో వెస్టర్న్ డ్రెస్సుల్లో, ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ + స్కర్ట్ లుక్, పెప్లం టాప్స్, షరారా, పలాజో సెట్‌లలో విరివిగా కనిపిస్తున్నాయి.
సంప్రదాయ డ్రెస్సులకు రెండు వైపులా ఫ్యాబ్రిక్ గులాబీల కుచ్చు ఉంటే, వెస్ట్రన్ స్టైల్స్‌లో బ్లౌజ్ లేదా గౌన్‌కు, సింగిల్ షోల్డర్ ఫ్రాక్‌కి ఒకవైపు గులాబీ గుచ్చం కనువిందు చేస్తుంది.
శారీ లేదా లెహంగా కూడా సింగిల్ షోల్డర్ రోజ్ బొకేని డిజైన్ చేయించుకోవచ్చు.
శారీ బ్లౌజ్ ట్రెండ్‌లలో గులాబీ స్లీవ్స్ అందంగా అమరిపోతున్నాయి.
రోజ్ స్లీవ్స్ ఎంచుకున్నప్పుడు జుట్టును పోనీటైల్ లేదా బన్ స్టైల్ వేసుకుంటే డ్రెస్సింగ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
హై నెక్ టాప్ అయితే డ్యూయల్ రోజ్ స్లీవ్స్ బాగుంటాయి.
(చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..)