
నిరాడంబరతను చాటుకోవాలన్నా ... విలాసవంతంగా కనిపించాలన్నా క్లాసీ లుక్‌తో ఆకట్టుకోవాలన్నా... ఎలాగైనా... ఏ వయసు అయినా ప్రతి సందర్భానికి అతికినట్టుగా ఆహార్యాన్ని అద్భుతంగా చూపుతుంది ఐవరీ కలర్. ఇటీవల భారతీయ ఫ్యాషన్ రంగంలో పేస్టల్ కలర్స్ అగ్రస్థానంలో ఉండగా వాటిలో ఐవరీ ఎప్పుడూ ఒక విలక్షణమైన స్థానంలోనే ఉండి ప్రతి మదిలోనూ రాయల్ లుక్‌గా కొలువుదీరుతోంది.
ఐవరీకి లేస్ అల్లికలు తోడైతే విరిసిన కలువ పూల అందం గుర్తుకు వస్తుంది. ప్రింట్లు తోడైతే ఆధునిక హస్తకళల అద్భుతం కళ్లముందు నిలుస్తుంది. వెల్వెట్, కాటన్‌లోనే కాదు కంచిపట్టులోనూ ఐవరీ కలర్ రిచ్‌నెస్‌ను కళ్లకు కడుతుంది.
ఐవరీ కాటన్ డ్రెస్‌కి లేయర్లు జత కలిసిన ఫ్రాక్ లేదా లెహంగా డిజైన్స్ ఎప్పటికీ ట్రెండ్‌లో ఉంటాయి.
రాయల్ లుక్ తో అట్రాక్ట్ చేయడమే ఐవరీ సహజ లక్షణం. అందుకే, వివాహ వేడుకలలో ఐవరీ కలర్ డ్రెస్సులు ఆహూతుల మదిలో చెరిగి΄ోని ముద్రను వేస్తాయి.
రన్ వే నుంచి రెడ్ కార్పెట్ సందడి వరకు, వివాహాల నుంచి పండగ కార్యక్రమాల వరకు, సామాన్యుల నుంచి సెలిబ్రిటీల వరకు ఐవరీని అందంగా ధరించడం చూస్తుంటాం. లేత రంగుతో ఉండే ఈ ఔట్‌ఫిట్స్‌ను ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. అయితే, ఈ రంగుపై ఏదీ అతిగా ఉండకూడదు. అది హెవీ ఎంబ్రాయిడరీ లేదా డిజిటల్ ప్రింట్లు, లేయర్లు, ఇతర ఫ్యాబ్రిక్స్.. కాంట్రాస్ట్ అయినా సరే...
స్టైలిష్ గౌన్లు, ఇండో వెస్ట్రన్ గౌన్లు, లెహెంగాలు, చీరలు, అనార్కలీలు.. ఏ డ్రెస్ అయినా ఐవరీ కలర్ చాలా అందంగా కనిపిస్తుంది.
క్లాసిక్ ఐవరీలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయి. స్కిన్‌టోన్ ఆధారంగా తగిన షేడ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. సరైన షేడ్‌తోపాటు ఐవరీ షేడెడ్ దుస్తులలో సరైన స్టైల్‌ను ప్రదర్శించడం కూడా ముఖ్యం.
ఆధునికతనూ, చక్కదనాన్ని తెలియజేసే సామర్థ్యం ఐవరీకి ఉండటం వల్ల ఫ్యాషన్‌లో ట్రెండింగ్ రంగుగా కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌లలో మోనోక్రోమ్ దుస్తులు, టైలర్డ్ ట్రౌజర్లు, సిల్క్ సెపరేట్‌లు, రిఫైన్డ్ ఔటర్‌వేర్, రకరకాల థీమ్‌లతో సహా వివిధ రూపాల్లో ఐవరీ ఉంది.
ఐవరీని ఎలా ధరించాలంటే...
వైడ్–లెగ్ ఐవరీ ప్యాంటు, రిబ్‌డ్ టర్టిల్ నెక్‌తో ట్రెంచ్ కోట్ వంటి ఐవరీ పీసెస్ జత చేయడం ద్వారా మోడర్న్ రూపాన్ని సృష్టించవచ్చు.
రిచ్ లుక్ కోసం లేస్–ట్రిమ్డ్ స్లిప్ స్కర్ట్‌తో జత చేసిన ఐవరీ సిల్క్‌టాప్‌తో డ్రెస్‌ను ఎలివేట్ చేయచ్చు.
జీన్స్‌లేదా ట్రౌజర్‌లకు ఐవరీ టాప్స్‌ను ధరించవచ్చు. క్లాసిక్, చిక్ లుక్ కోసం బ్లాక్ ΄్లాట్స్‌ని ధరించవచ్చు.
ఫార్మల్, ఈవెనింగ్ వేర్‌గా ఐవరీ–రంగు గౌన్లు, అనార్కలీ సూట్‌లను ఎంచుకోవచ్చు.
వెడ్డింగ్ కలర్
వధూవరుల దుస్తులకు ఐవరీ సరైన ఎంపికగా ఎప్పుడూ ముందుంటుంది. వధువు లెహంగా లేదా చీర, వరుడి ధోతి– కుర్తా ... వంటి దుస్తులు వివాహ వేడుకలో వారి బంధంలోని స్వచ్ఛతను సూచిస్తుంది.