
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ప్రస్తుతం గ్రీస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.తన మోడ్రన్ లుక్స్‌కు దేశీ ట్విస్ట్ ఇవ్వడం కరీనా ఫ్యాషన్ స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
పసుపు రంగు హాల్టర్-నెక్ బ్రాలెట్‌తో పాటు గళ్ల లుంగీ-స్టైల్ స్కర్ట్‌లో అల్ట్రా-హిప్‌గా కనిపిస్తున్న కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది కరీనా. నల్ల సన్ గ్లాసెస్ , బ్రౌన్ టోపీతో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.
తన ఫోటోలకు “గ్రీస్‌లో లుంగీ డ్యాన్స్ ..భలే మజా వచ్చింది. తప్పకుండా తప్పక ప్రయత్నించండి’’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం. దీనికి వెరైటీ లుంగీ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు, కరీనా స్నేహితులు మనీష్ మల్హోత్రా, సావ్లీన్ మంచాంద, పూనమ్ దమానియా ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు.
ఇటీవల వివాదం రేపిన ప్రాడా కొల్హాపురి చెప్పులపై కూడా ఎమోజీలతో సెటైర్ వేసింది కరీనా. కొల్హాపురి మెటాలిక్ సిల్వర్ స్లిప్పర్లలో ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ.. "సారీ...ఇది ప్రాడా కాదు... నా OG కొల్హాపురి" అని క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొల్హాపురి చెప్పులనుంచి భారతీయ లుంగీ వరకు కరీనా స్టైలింగ్, ఫ్యాన్స్ ప్రశంసలు లభిస్తున్నాయి.