పార్టీ ఏదైనా సుందరాంగుల మణికట్టు... కనికట్టు | Check these five varities of bangles for your style | Sakshi
Sakshi News home page

పార్టీ ఏదైనా సుందరాంగుల మణికట్టు... కనికట్టు

Jun 20 2025 2:40 PM | Updated on Jun 20 2025 3:35 PM

Check these five varities of bangles for your style

గాజులది ఆభరణాలను మించిన స్థాయి. సంప్రదాయం, వేడుక ఏదైనా మణికట్టు చుట్టూ మెరిసే వ్యక్తిగత శైలి.  వివాహిత మహిళలకు గాజులలో శ్రేయస్సు, ప్రేమ మెండుగా కలిసి ఉంటాయి.అందుకే, పా మట్టి గాజులైనా వాటి స్థానాన్ని వీడి పోవు.ఆధునిక మహిళ ఆ గాజులను కొత్త అల్లికలు, రంగులు, శైలులతో మణికట్టును కనికట్టు చేస్తోంది.వేడుకల కోసం రకరకాల ఆభరణాలతో వార్డ్‌రోబ్‌ను కొంగొత్తగా నిర్మిస్తున్నా రాబోయే పండుగ రోజుల్లో చేతుల లుక్‌ను పెంచుకోవాలనుకునే వారికి సేకరణలో పూర్తిగా చోటు సంపాదించడానికి కావల్సినన్ని జతల గాజులు దొంతర్లుగా సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ట్రెండ్‌లో ఉన్న ముఖ్యమైన ఐదు రకాలు గాజుల పెట్టెలో తప్పక ఉండాల్సిందే! 

 

ప్రతిరోజు గ్లామర్‌ ... మినిమలిస్ట్‌ గోల్డ్‌ కడా బ్యాంగిల్‌
బంగారు కడా గాజులు నిన్నటి తరం తప్పని ఆభరణం. బరువైన, చంకీ కడాలు  ఇప్పుడు అందరికీ నచ్చడం లేదు. కొత్త తరం వెర్షన్‌ సొగసైనది, తేలికగా ఉండేది కోరుకుంటుంది. ఆధునిక టచ్‌తో కూడిన సాధారణ, లైట్‌వెయిట్‌ బంగారు కడాలను ఎంపిక చేసుకోవచ్చు. అల్లికలు, చివరలు ఓపెన్‌గా ఉండేవి, ఒకటి లేదా రెండు రేఖాగణిత నమూనాలు ఉన్నవి.. రోజువారీ దుస్తులకు సరైనవి. పూజల నుండి సంప్రదాయ శైలి వరకు కొన్ని సన్నని గాజులు, బోల్డ్‌ సింగల్‌ కడా ధరిస్తే రెండు విధాలుగా ఆకట్టుకుంటుంది. రిచ్‌ లుక్‌ కోసం ఒక మంద΄ాటి కడాను రెండు సున్నితమైన బంగారు గాజులతో జత చేయవచ్చు. ఫ్యామిలీ ఈవెంట్స్, కార్యాలయ పూజలు, రోజువారీ సల్వార్‌ సూట్‌కు కూడా ఇవి బాగుంటాయి.

పోల్కీ గాజులు – భారతీయ వివాహానికి తప్పనిసరి
బాలీవుడ్‌ వధువుల ఎంపికతో  పోల్కీ బ్యాంగిల్స్‌ తిరిగి వచ్చాయి. గతంలో కంటే మరింత పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. అన్‌కట్‌ డైమండ్స్‌తో హెరిటేజ్‌ ఆకర్షణతో కూడిన ఈ గాజులు రాచకళను సృష్టిస్తున్నాయి. వివాహ వేడుకలకు ఇవి ప్రత్యేకం అని చెప్పవచ్చు. వేడుకలో ఎంచుకున్న డ్రెస్‌కు తగిన కలర్, డిజైన్‌ను బట్టి గాజుల తయారీ ఉంటుంది. ఇవి ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సెట్స్‌ అని చెప్పవచ్చు. వారసత్వ సంపదకు అర్హమైనవి, ఏదైనా పండుగ దుస్తులకు తక్షణ గ్లామ్‌ను జోడిస్తాయి.పోల్కీ గాజులను మెరిసేలా అలంకరించాలి. దీనికి కాంబినేషన్‌గా పోల్కీ చోకర్, చెవి పోగులతో జత చేయచ్చు. వివాహాలు, కర్వా చౌత్, యానివర్సరీ  పార్టీలు, రాణిలా భావించాలనుకునే ఏదైనా కార్యక్రమంలో ఈ పోల్కీ గాజులను ధరించవచ్చు.

మీనాకారీ గాజులు – రంగుల ఆనందం
రంగుల రంగులతో ఉండే గాజులను ఎవ్వరైనా ఇష్టపడతారు.  మీనాకారీ గాజుల ప్రకాశవంతమైన ఎనామిల్‌ వర్క్, అద్భుతమైన డిజైన్‌లకు పేరొందాయి. పూల నుండి నెమళ్ల వరకు ఇవి సంస్కృతి, రంగుల పరిపూర్ణ మిశ్రమం. దుస్తుల రంగులకు తగినవి ఎంపిక చేసుకోవాలంటే మీనాకారీ గాజులు సరైన ఎంపిక. పండుగలు, వేడుకలలో అలంకరణ బోరింగ్‌గా ఉండకుండా ఇవి సంప్రదాయ శక్తిని తెస్తాయి. లెహంగా లేదా చీర బార్డర్‌ కి సరిపోయే రంగు గాజులను ఎంచుకోవచ్చు. బోనాలు, నవరాత్రి, దీపావళి, తీజ్, హల్దీ ఫంక్షన్ల సమయాల్లో ధరించే దుస్తులకు ఈ గాజులు అదనపు ఆకర్షణను తెస్తాయి. వీటిలో వేడుకను బట్టి, ఫొటో బ్యాంగిల్స్‌ జత చేయడం మరో ఆకర్షణ. (ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్‌ హీరో)
 

స్టేట్‌మెంట్‌ కఫ్‌ బ్యాంగిల్స్‌ – ఆధునిక శైలి
ప్రతి గాజూ సంప్రదాయకంగా ఉండనవసరం లేదు. మీదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ చూపించాలనుకున్నప్పుడు కఫ్‌ బ్యాంగిల్స్‌ సరైనవి. వీటిలో ముత్యాలు, స్టోన్స్, ఎనామెల్‌ లేదా వెడల్పుగా మెటల్‌ కఫ్‌లను ఎంచుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్‌ శైలికి ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. స్పెషల్‌గా, సాధారణ దుస్తులను కూడా ఫ్యాషన్‌–ఫార్వర్డ్‌గా కనిపించేలా ఈ కఫ్‌ బ్యాంగిల్స్‌ చేస్తాయి. మణికట్టు మీద చంకీ కఫ్‌ ధరించి, మరొకటి సాధారణమైనది వేసుకోవాలి. ఇది స్టైల్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. స్టేట్‌మెంట్‌ పీస్‌గా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాక్‌టెయిల్‌ పార్టీలు, ఫ్యూజన్‌ దుస్తులు లేదా మీరు మీ స్టైల్‌ గేమ్‌ను ప్రదర్శించాలనుకునే ఆఫీస్‌ గ్యాదరింగ్స్‌ కూడా ఈ కఫ్‌ బ్యాంగిల్స్‌ సరైన ఎంపిక. 

ట్రెండ్స్‌ మారుతాయి. కానీ గాజులు ఎప్పటికీ ఉంటాయి. వివాహ జ్ఞాపకాలలో, పండుగలలో, రోజువారీ ఆచారాలలో, వ్యక్తిగత ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌లో కూడా భాగంగా నిలుస్తాయి. చక్కగా అలంకరించిన గాజుల చేతులు అద్భుతంగా కనిపించడమే కాదు, అవి మీదైన ప్రత్యేకతను ఎదుటివారికి పరిచయం చేస్తాయి. ఇక ఇప్పుడు మీరు గాజులు ధరించడానికి వివాహిత మహిళ మాత్రమే కాదు, నేటి అభివృద్ధిలో వెలిగే ఒక స్టైల్‌ ఐకాన్‌ కూడా!

ఇదీ చదవండి: నో డైటింగ్‌, ఓన్లీ జాదూ డైట్‌ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
 

Advertisement
 
Advertisement
Advertisement