
నటి సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) సింపుల్ డిజైనర్ వేర్‌లో ట్రెండీగా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడే తన స్టైలిష్ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటారామె. అలానే ఈసారి పచ్చి మామిడకాయ లోపలి భాగం రంగులోని చీరలో తళుక్కుమ్మంది. ఆ సంప్రదాయ చీరలో స్టైలిష్‌గా కనిపిస్తున్న సమంత అనుసరించిన ఫ్యాషన్ శైలి 1930ల నాటిది. అంతేకాదండోయ్ నాటి గ్లామర్ స్టైల్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ చీర డిజైనింగ్ చెప్పే అర్థం చూస్తే షాకవ్వుతారు.
ఇక్కడ సమంత రా మ్యాంగో శాటిన్ సిల్క్ చీరలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వావ్..! వాటే శారీ అనేలా ఉంది ఆమె లుక్. ఈ తాజా లుక్ 1920-30ల ఛానెల్ ఆర్డ్ డెకో శైలి అట. అంటే..ఇక్కడ సమంత ధరించిన చీర ఆర్ట్ డెకో ఉద్యమం నుంచి ప్రేరణ పొందిన డిజైన్. ఈ చీరపై కనిపించే బోల్డ్ లైన్లు, రేఖాగణిత నమునాలు, నిర్మాణ నైపుణ్యానికి సంబధించిన డిజైన్‌లో రూపొందిస్తారు.
సింపుల్‌గా చెప్పాలంటే ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన గీతలే దర్శనమిస్తాయి. దీనిలో కనిపించే క్షితిజ సమాంతర రేఖలకు ప్రేరణ ఏరోడైనమిక్ డిజైన్ అని, ఇవి నాటికల్ అంశాలను కూడా నొక్కిచెబుతాయని అంటున్నారు ష్యాషన్ నిపుణులు. అయితే ఈ గీతలు, రేఖలు అన్ని చేతితో చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ అట. సున్నితమైన బంగారు జరీతో డిజైన్ చేస్తారట.
చూడటానికి సాదాసీదాగా కనిపించే ఈ శారీని రిచ్‌లుక్‌లో ఉండి, రాచరికానికి అద్ధం పట్టే విలాసవంతమైన స్టైలిష్‌వేర్‌గా అభివర్ణిస్తారు ఫ్యాషన్ ప్రియులు. ఆ చీరకు తగ్గ మేకప్, చెవిపోగులు, కాక్‌టెయిల్ రింగ్‌తో తన రూపాన్ని అద్భుతంగా కనిపించేలా చేసింది సమంత. పాత ఫ్యాషన్‌కి సరికొత్త రూపమిచ్చేలా కొత్త ట్రెండ్‌ని సెట్ చేసేలా ఉంది సమంత వింటేజ్ ఆర్ట్ డెకో లుక్. చాలా సింపుల్‌గా కనిపిస్తున్న ఈ శాటిన్ సిల్క్ చీర ధర వచ్చేసి సుమారు రూ. 50 వేలు పైనే పలుకుతుందట.
(చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..)