
సినీ ప్రముఖుల, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 అంగరంగా వైభవంగా జరిగింది. ఈ నెల 13న మొదలైన ఈ వేడుక శనివారంతో ముగిసింది. ఈ ఫ్యాషన్ వేడుకలో మనదేశం తరఫున ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. వారంతా విలాసవంతమైన దుస్తులు, బ్రాండెడ్ ఆభరణాలతో రెడ్‌కార్పెట్‌పై మెరిశారు.
అయితే ఈ కాన్స్ ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటి అలియా భట్ హైలెట్‌గా నిలిచారు. ఆమె ఈ కేన్స్‌లో పాల్గొనడం తొలిసారి. పైగా అలియా లోరియల్ పారిస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ వేడుకలో ప్రాతినిధ్యం వహించారు.
అయితే ఈ ముగింపు వేడుకల్లో అలియా గూచీ చీర లుక్ అందర్నీ మిస్మరైజ్ చేసింది. స్ఫటికాలు, ఐకానిక్ జీజీ మోనోగ్రామ్‌తో అలంకరించబడిన కస్టమ్-మేడ్, వెండి రంగు గూచీ చీర ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఈ మేరకు వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఆ చీరలో రెడీ అవ్వడానికి ఎంతలా పాట్లు పడ్డానో వివరించారు అలియా.
కాన్స్ ముగింపు వేడుక కోసం ప్రిపేర్ అవ్వుతుండగా..ఒక రకమైన గందరగోళం ఎదురైంది. తాను ముగింపు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా ఆత్రుతగా ఉంటే..సరిగ్గా రెడీ అయ్యే టైంకి కరెంట్ లేదు. దాదాపు నాలుగు గంటల నుంచి కరెంట్ లేదు. విద్యుత్ లేకపోతే మేకప్ దగ్గర నుంచి చీర కట్టుకునేంతవరకు ఏ పని సవ్వంగా అవ్వదు.
ఏంటో టెన్షన్ నన్నువెతుక్కుంటూ వస్తుందా అనే ఫీలింగ్ వచ్చిందంట అలియాకి. హెయిర్ స్టైలిస్ట్‌లు, మేకప్ మ్యాన్‌లు తమ సౌందర్య పరికరాలను పనిచేసేలా ఎండలో ఉంచి..తనని రెడీ చేసేందుకు ట్రై చేస్తుండగా.. కరెంట్ వచ్చేసిందంటా. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ ఆఘమేఘాలపై అలియాని రెడీ చేశారట.
థ్యాంక్ గాడ్..ఉత్కంఠ రేపేలా టెన్షన్‌కి గురిచేసినా..గూచి బ్రాండ్ తయారు చేసిన ఈ చీరలుక్ అందరి మదిని దోచుకోవడం సంతోషాన్నిచిందని అంటోంది. అలాగే ఈ ఆనందం అతకముందుకు అనుభవించిన హైరానా మొత్తం ఉఫ్‌మని ఎగిరిపోయేలా చేసిందిని చెబుతోంది అలియా.
ఇక గూచీ బ్రాండ్ రూపొందించిన ఈ చీరకు బ్యాక్‌లెస్ బ్లౌజ్, ప్లంగింగ్ నెక్‌లైన్, ఫ్లోర్-గ్రేజింగ్ స్కర్ట్ ఎంత సూటబుల్‌గా ఉంది. చెప్పాలంటే అలియా లుక్ భారతీయ సంప్రదాయాన్ని సమకాలీన అంశాలతో మిళితం చేసినట్లుగా ఉంది. పైగా కాన్స్ 2025లో చిరస్మరణీయమైన సైలిష్ లుక్‌గా నిలిచింది.
(చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాళిని బ్యూటీ రహస్యం ఇదే..!)