
ఇంటికి ఐశ్వర్యాన్ని, పండగ కళనూ తీసుకువచ్చే మాసంగా శ్రావణానికి పేరు. పూజలు, వివాహ వేడుకలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ రోజుల్లో వాతావరణం మబ్బు, తుంపరలతో డల్‌గా కనిపిస్తుంది. ఇలాంటి సమయాలలో బ్రైట్‌గా వెలిగిపోవాలంటే పట్టు ఎంపిక ఎప్పుడూ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. పట్టు చీరలు అన్నివేళలా ఒకే తరహా కట్టు అంటే బోర్‌గా ఫీలయ్యే నవతరానికి
మోడర్న్ స్టైల్‌లో కట్టు, కుట్టు డిజైన్స్ చాలానే వచ్చాయి. ఈ మాసంలో మెరుపును, ఉత్సాహాన్ని ఇచ్చే పట్టు ఇండోవెస్ట్రన్స్ స్టైల్స్ ఇవి...
డ్యుయెల్ టోన్...
పండగలు అనగానే మనలో చాలామంది ఎరుపు, పసుపు, పచ్చ రంగుల గురించి ఆలోచన చేస్తారు. ఈ యేడాది ట్రెండ్‌లో ఉన్న రంగులు.. పీకాక్ బ్లూ, గోల్డ్ పట్టు చీరలు లేదా డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ఎంచుకోవాలి. బాటిల్ గ్రీన్– మెరూన్ కలిసిన సంప్రదాయ రంగులు పండగల సమయాల్లో, లావెండర్ – సిల్వర్, మెహందీ రంగులు పూజలకు, మస్టర్డ్– నేవీ బ్లూ రంగులు ఇండోర్ ఈవెంట్‌లకు బ్రైట్ లుక్‌నిస్తాయి.
దీంతోపాటు రెండు రంగుల కాంబినేషన్‌లో వచ్చే డ్యుయెల్ టోన్ పట్టుచీరలు వేడుకలకు మంచి లుక్‌ను తీసుకు వస్తాయి. ఉదాహరణకు బ్లూ– పింక్, గోల్డ్– మెరూన్ .. కలయికలతో ఉన్నవి. పట్టు చీరలు లైట్‌వెయిట్‌లోనూ లభిస్తున్నాయి. పెద్ద జరీ అంచు చీరలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. మన చేనేతలైన గద్వాల, ΄ోచంపల్లి, నారాయణపేట, పీతాంబరం, బనారసి.. పట్టు చీరలు ఈ మాసానికి నిండుతనాన్ని తీసుకువస్తాయి.
పట్టు లాంగ్ జాకెట్స్/ కేప్స్...
ప్లెయిన్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుంటే బనారసీ లాంగ్ జాకెట్ బ్రైట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది. లాంగ్ గౌన్‌పైకి జాకెట్ లేదా కేప్ లేయర్డ్‌గా ఉండి స్టైలిష్ ఎంపిక అవుతుంది.
మోడర్న్ పట్టు బ్లౌజ్‌లు...
పట్టు చీరలు/ స్కర్ట్స్‌కి ఆఫ్–షోల్డర్ బ్లౌజ్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. పట్టుచీర పూర్తి సంప్రదాయ విధానం అని ఆలోచించే యువతరానికి పెప్లమ్ స్టైల్ బ్లౌజ్ లేదా బెల్ట్‌తో కూడిన చీర కట్టు మంచి లుక్‌తో నప్పుతుంద. బ్యాక్–ఓపెన్ లెహంగా స్టైల్ చీర కట్టుకు హాల్టర్ నెక్ బ్లౌజ్, ప్లెయిన్ సిల్క్ స్కర్ట్‌కి కాలర్ నెక్ ఉన్న షర్ట్ స్టైల్ బ్లౌజ్‌తో ఆధునికతను జోడించవచ్చు.
పట్టు లాంగ్ గౌనులు
కాంచిపట్టు లేదా మైసూర్ సిల్క్ చీరలతో డిజైన్ చేసిన లాంగ్ గౌనులు ఈ మాసంలో ప్రత్యేకంగా ధరించవచ్చు. అమ్మాయిలకు ఇవి సరైన ఛాయిస్ అవుతాయి. శరీరాకృతికి తగినట్టు, ఫ్లేయర్డ్ స్కర్ట్‌ని అలాగే ధరించవచ్చు. కొన్నిసార్లు దుపట్టాతో కూడా మ్యాచ్ చేయవచ్చు. ఎంగేజ్‌మెంట్, రిసెప్షన్, వివాహ ఊరేగింపు.. సమయాలలో వీటి ఎంపిక ఈ సీజన్‌లో ప్రత్యేకంగా ఉంటుంది.
ఇండో–వెస్ట్రన్ పట్టు
పట్టు క్రాప్ టాప్‌కి లెహెంగా లేదా స్కర్ట్ ధరించవచ్చు. వీటిలో బనారసి లేదా ఉ΄్పాడ క్రాప్ టాప్ (స్లీవ్‌లెస్/బోట్ నెక్/హై నెక్)తో ఉన్నవి ఎంచుకోవచ్చు. వీటికి లేయర్డ్ కాంట్రాస్ట్ జరీ లెహెంగా మంచి కాంబినేషన్ అవుతుంది. జరీ బోర్డర్‌ని నెట్ లేదా జార్జెట్ ఫ్యాబ్రిక్‌కి జత చేసి దుపట్టాను డిజైన్ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలు, రాఖీ వంటి పండగలు, ఎంగేజ్‌మెంట్ వంటి వేడుకలకు ఇది మంచి ఎంపిక అవుతుంది.
విభిన్న మోడల్స్ కట్టు
డిజైనర్ బ్లౌజ్ ధరించే సాధారణ పట్టు చీరను ఎంచుకుంటే దానికి నడుము వద్ద ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్ బెల్ట్ ధరించవచ్చు. వడ్డాణానికి మరొక శైలి. ఈ స్టైల్ యంగ్ లుక్‌ని తీసుకువస్తుంది. దీనికి టెంపుల్ జ్యువెలరీ, చోకర్లు ఉపయోగించవచ్చు.
పట్టు ధోతీ ప్యాంటు– షార్ట్ కుర్తీ
అమ్మాయిలు ట్రెండీ లుక్ కోసం ఇటీవల ధోతీ ప్యాంట్ , షార్ట్ కుర్తీని ఎంచుకుంటున్నారు. వీటిని పట్టుతో డిజైన్ చేస్తే ఈ కాలం స్టైలిష్‌గానూ, సంప్రదాయ లుక్‌తో బ్రైట్‌గా మెరిసిపోతారు. ధోతీ ప్యాంట్ కోసం నారాయణపేట, గద్వాల్ సిల్క్‌లను ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ/మిర్రర్ వర్క్ చేసిన షార్ట్ కుర్తీలు ధోతీ ప్యాంటుకు మంచి కాంబినేషన్ అవుతుంది. వీటికి కొల్హాపురి లేదా జుట్టీలు పాదరక్షలుగా ఎంచుకోవాలి.
– ఎన్నార్
(చదవండి: సమద్రగర్భంలో..మహిళా స్కూబాడైవర్‌లు..!)