
పర్యావరణానికి హాని కలిగించే విధంగా అంతకంతకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను దృష్టిలో పెట్టుకొని అండమాన్ నికోబార్‌లోని నార్త్ బే దీవిలో 24 మంది స్కూబాడైవర్‌లు ‘మెరైన్ క్లీనప్ డ్రైవ్’ నిర్వహించారు. వీరిలో పదిమంది మహిళలు ఉన్నారు. ‘ఉమెన్స్ డైవ్ డే 2025’ బ్యానర్‌పై పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
‘మహిళల కోసం ప్రత్యేకమైన డైవింగ్ కార్యక్రమాలు చేపట్టాం. నార్త్ బే, స్వరాజ్ ద్వీప్, షాహీద్ ద్వీప్‌లలో డైవర్ టీమ్‌లు అండర్‌వాటర్ క్లీనప్ మిషన్‌లో భాగమై పర్యావరణ సంరక్షణపై తమ నిబద్ధతను చాటుకున్నాయి’ అని వివరించారు టూరిజం సెక్రెటరీ జ్యోతి కుమారి. ఈ డైవ్‌లో పాల్గొన్నవారిలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కమాండెంట్ నిహారిక భట్ ఒకరు.
‘గత సంవత్సరం ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌కు సంబంధించి బేసిక్, అడ్వాన్స్ డైవింగ్ కోర్సులు పూర్తి చేశాను. అండమాన్ నికోబార్ దీవులలో ప్రపంచంలోనే అత్తున్నతమైన డైవింగ్ డెస్టినేషన్‌లు ఉన్నాయి. డైవింగ్ అనేది ఉల్లాస పరిచే నీటి ఆట మాత్రమే కాదు సముద్ర పరిరక్షణపై అవగాహన కలిగిస్తుంది’ అంటుంది నిహారిక భట్.
(చదవండి: నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు)