
బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ బుర్బెర్రీ అమ్మకాలు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమవుతోంది. 2027 నాటికి ఖర్చులను తగ్గించే ప్రణాళికలలో భాగంగా తన సిబ్బందిలో 1700 మందిని తొలగించే అవకాశం ఉందని ప్రకటించింది. 2025 మే 14 న తమ బడ్జెట్‌లో కాస్ట్ కటింగ్ వివరాలను వెల్లడించింది.
తాజా నివేదికల ప్రకారం భారీ నష్టాలను చవిచూసిన తర్వాత బుర్బెర్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ కోతలు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను ఐదో వంతు తగ్గించుకోనుంది. ఇది వెస్ట్ యార్క్‌షైర్‌లోని ఇంగ్లీష్ బ్రాండ్, కాజిల్‌ఫోర్డ్ ఫ్యాక్టరీలో సంభావ్య తొలగింపులకు కూడా కారణమవుతుంది. కోతలు ఎక్కువగా యూకేలోని ఉద్యోగులను ప్రభావితం చేయనున్నాయని తెలుస్తోంది.
చదవండి: Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నద
బుర్బెర్రీ అమ్మకాల విషయంలో ఎక్కువగా నష్టపోతోంది. చైనా, అమెరికాలో విలాసవంతమైన విభాగంలోని వస్తువులకు డిమాండ్ బాగా క్షీణించింది. మార్చి 29తో ముగిసిన సంవత్సరానికి పోల్చదగిన స్టోర్ అమ్మకాలలో 12శాతం తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది వార్షిక ఆదాయం 17 శాతం క్షీణించింది. ఖర్చు తగ్గించే చర్యల ఫలితంగా 2027 నాటికి నాటికి 100 మిలియన్ల పౌండ్ల ఆదా అవుతాయని కంపెనీ చెబుతోంది.
ఇదీ చదవండి: కోవిడ్ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలు
కాగా లగ్జరీ ఫ్యాషన్ హౌస్ బుర్బెర్రీని 1856లో థామస్ బుర్బెర్రీ స్థాపించారు. ఇది ట్రెంచ్ కోట్లు, లెదర్ ఉత్పత్తులు, వాచెస్, పాదరక్షలతో సహా వివిధ రకాల విలాసవంతైన ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తుంది. ఐకానిక్ డిజైన్, నాణ్యత , లగ్జరీ ఫ్యాషన్‌కు బాగా ప్రసిద్ధి చెందింది. గబార్డిన్ అనే వస్త్రంతో రూపొందించే వాటర్‌ప్రూఫ్ దుస్తులు మరీ ప్రత్యేకం.
చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?