ప్రతి లుక్‌లో మూడ్, ప్రతి మూడ్‌లో మ్యాజిక్ చూపించే నిహారికా స్టయిల్, అచ్చం ఆమెలానే! క్రియేటివ్ టచ్‌తో, కంఫర్ట్ స్పార్క్‌తో నిండిన ఆమె స్టయిలింగ్ ఎప్పుడూ ఒక ఆర్ట్‌లా అనిపించేస్తుంది.
నా ఫ్యాషన్ ఫార్ములా?
మిక్స్ ఇట్ అప్! ట్రెడిషనల్ టచ్‌కి మోడర్న్ ట్విస్ట్ జోడించడం నాకు ఇష్టం. క్యూట్ బిందీతో వెస్టర్న్ వేర్ స్టయిల్ చేస్తాను, అలాగే ట్రెడిషనల్ దుస్తులు ధరించినప్పుడు ఫంకీ జ్యూలరీ లేదా కూల్ ఫుట్‌వేర్‌తో మిక్స్ చేస్తా. నా మూడ్‌ను బట్టి లుక్ కూడా మారిపోతుందని అంటోంది నిహారికా
చిన్నగా మెరిసే మెరుపు!
చిన్నదే, కానీ చెవుల్లో పెద్ద ఫన్ షో లాంటి ప్రభావం! అవే మినీ హ్యాంగింగ్స్. పెద్ద ఇయర్‌రింగ్స్ కంటే, ఇవి తేలిగ్గా, క్యూట్‌గా ఉంటూ ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్ ఇస్తాయి. ఒక్కసారి మినీ గోల్డ్ బీడ్స్, చిన్న ముత్యాలు, కలర్ స్టోన్స్ వంటివి వేసుకుంటే, సాధారణ డ్రెస్సు కూడా ప్రత్యేకంగా మెరుస్తుంది. డైలీ వేర్‌కి, సింపుల్ డిజైన్ హ్యాంగింగ్స్ ఎల్లప్పుడూ బెస్ట్ ఆప్షన్.
ఆఫీస్‌కి వెళ్లినా, క్లాస్ రూమ్‌లో కూర్చున్నా, మీరు ప్రొఫెషనల్, ఫ్రెష్ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తారు. కాని, పార్టీ లేదా ఫంక్షన్ కోసం అయితే, కొంచెం స్టోన్ హ్యాంగింగ్స్ స్టేట్‌మెంట్‌గా మారతాయి. పోనీ, వేవీ, కర్ల్స్ ఏ హెయిర్ స్టయిల్ అయినా ఈ చిన్న హ్యాంగింగ్స్ క్యూట్ అండ్ రాయల్టీ ఫీల్‌ను ఇస్తాయి. ఇక్కడ నిహారిక ధరించిన చీర డిజైన్ చేసింది అశ్విని త్యాగరాజన్, ధర: రూ. 70,000, ఇక జ్యూలరీ : బ్రాండ్: రాజీ ఆనంద్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
(చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..)


