
సాక్షి, సిటీబ్యూరో: ’లెగ్దా డిజైన్ స్టూడియో’ వేదికగా నిర్వహించిన ‘ఫ్యాషన్ స్ట్రీట్ వాక్’లో నగరంలోని టాప్ మోడల్స్ అధునాతన ఫ్యాషన్ డిజైన్లతో అలరించారు. మహిళల ట్రెండీ డిజైన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కలర్‌ఫుల్‌గా మార్చుతున్న లెగ్దా డిజైన్ స్టూడియో నూతన బ్రాంచ్‌ను హబ్సిగూడలో సోమవారం టాలీవుడ్ తార అనన్య నాగళ్ల ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఈ తరం అమ్మాయిల అందాలను ఇనుమడింపజేసే డ్రీమ్ డిజైన్‌లను సృష్టించడానికి లెగ్దా డిజైన్ స్టూడియో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
మహిళలకు ఉపాధిని కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న డిజైనర్ దివ్య కర్నాటి సేవలు మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లో ఫ్యాషన్ స్టూడియో ఏర్పాటు చేయడం ఇక్కడి ష్యాషన్ హంగులకు, ఆదరణకు తార్కాణాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేషెంట్‌ను పరిక్షించి డాక్టర్ మందులు ఇచ్చినట్టే, శరీర రూపురేఖలను బట్టి ఫ్యాషన్ దుస్తులను రూపొందించడం వినూత్న కళ అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
ఇదీ చదవండి: బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!
గ్లోబల్ డిజైన్స్..
వైవిధ్యాన్ని కోరుకునే ఈ తరం యువతకు అధునాతన సృజనాత్మకతను జోడిస్తూ డిజైనింగ్ చేస్తున్నాం. ఇద్దరితో మొదలైన మా ప్రయాణం 30 మందికిపైగా ఫ్యాషన్ డిజైనర్లకు అవకాశాలను కలి్పస్తున్న ఫ్యాషన్ సెంటర్‌గా ఆవిష్కృతమైంది. గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్స్‌ను రూపొందిస్తున్నాం.
– దివ్య కర్నాటి, లెగ్దా డిజైన్ స్టూడియో నిర్వాహకులు