నటి మడోన్నా సెబాస్టియన్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..! | Madonna Sebastian Beauty Secret And Fashion Brands | Sakshi
Sakshi News home page

నటి మడోన్నా సెబాస్టియన్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!

Jun 1 2025 3:28 PM | Updated on Jun 1 2025 5:39 PM

Madonna Sebastian Beauty Secret And Fashion Brands

చక్కని చిరునవ్వుతో మనసు గెలుచుకునే నటి మడోన్నా సెబాస్టియన్‌. తెరమీద కనిపిస్తే ఆ ఫ్రేమ్‌కే అందం తెచ్చిపెట్టగలిగేంత అందంగా ఉంటారు. అలా తెరమీదనే కాదు, తెరవెనుక కూడా కనులవిందుగా ఉంటుంది ఆమె స్టయిలింగ్‌. ఇందుకోసం ఆమె సెలెక్ట్‌ చేసుకున్న కొన్ని ఫ్యాషన్‌ బ్రాండ్సే ఇవి.

చెవి దగ్గర మొదలై మెడ చుట్టూ తిరిగి జడలో ముగిసే అందమైన కథే చెంపసరాలు. ఇవి కేవలం ఆభరణాలే కాదు. జడలోకి దిగి వచ్చే పూల గొలుసులు. ఇవి పెట్టుకున్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఆ ఫ్రేమ్‌ మొత్తం అందంగా మెరిసిపోతుంది. చెంపసరాల ట్రెండ్‌ కొత్తేమీ కాదు. కాని, ఇప్పుడు వీటి ప్రెజెంటేషన్, స్టయిలిష్‌గా మారడంతో మళ్లీ వీటికి రీబర్త్‌ వచ్చింది. 

మోడర్న్‌ వన్‌ పీస్‌ డ్రెస్స్‌ల్లోకి కూడా అమ్మాయిలు స్టేట్‌మెంట్‌ లుక్‌గా వీటిని వేసుకుంటున్నారు. ముత్యాలు, కుందన్, రుబీ, టెంపుల్‌ ఇలా రకరకాల డిజైన్లలో లభించే చెంపసరాలను వేసుకుంటే, చుట్టూ ఉన్నవాళ్ల చూపులన్నీ మీ చెవులవైపు తిప్పేలా చేస్తాయి. 

చీర, లెహంగా, లాంగ్‌ ఫ్రాక్‌ డ్రెస్‌ ఏదైనా, వీటిని వేసుకోవడానికి కమ్మలను మాత్రం పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, బోసిగా ఉంచిన మెడ, చెంపసరాలకు తగ్గట్టుగా ఉండే హెయిర్‌ స్టయిల్, సింపుల్‌ గాజులు ఇవన్నీ కలిస్తేనే అందం. అప్పుడే చెంపసరాలకు, వాటిని వేసుకున్న మీకు పర్‌ఫెక్ట్‌ లుక్‌ వస్తుంది. అచ్చం నటి మడోన్నా లుక్‌లాగా.

అందం అందులో ఉండదు..
అందం అంతా క్రీమ్స్, మేకప్స్‌లో ఉండదు. మంచి స్కిన్‌ కేర్‌లోనే ఉంటుంది. ఆల్మండ్‌ ఆయిల్‌ మసాజ్, నేచురల్‌ ప్రాడక్ట్స్, హైడ్రేటింగ్‌ స్కిన్‌ కేరే నా బ్యూటీ సీక్రెట్‌. దుస్తుల్లో కూడా ‘ఇది నాకు నప్పుతుందా?’ అని కాకుండా ‘ఇది నేను కంఫర్ట్‌గా వాడతానా?’ అని ఆలోచించి సెలక్ట్‌ చేస్తానని చెబుతోంది మడోన్నా సెబాస్టియన్‌. 

-దీపిక కొండి

(చదవండి: ఘనంగా ముగిసిన మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement