జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫ్యాషన్‌ సీక్రెట్‌..! అదొక్కటి చాలు.. | Jacqueline Fernandez shares her Fashion And Style secrets | Sakshi
Sakshi News home page

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫ్యాషన్‌ సీక్రెట్‌..! అదొక్కటి చాలు..

Jun 22 2025 8:52 AM | Updated on Jun 22 2025 9:17 AM

Jacqueline Fernandez shares her Fashion And Style secrets

చిరునవ్వుతో ట్రెండ్‌ సెట్‌ చేయడమే జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ స్టయిలింగ్‌ టెక్నిక్‌! మేకప్‌ కాదు, ఫిట్‌నెస్, ఫన్‌ , ఫ్యాషన్‌  ఈ మూడింటి మిక్స్‌తో తన లుక్‌ని మెరిపిస్తుండటం ఆమె అలవాటు. అయితే, ఆమె లుక్‌లో అసలైన మెరుపు చిరునవ్వులోనే దాగి ఉందట!

నేను ఫాలో అయ్యే స్టయిలింగ్‌ రూల్‌  ‘ఒకటి ఎక్కువ అయితే, మరొకటి తక్కువ’. అంటే, చెవిపోగులు హెవీగా ఉంటే, మెడలో జ్యూలరీ ఉండదు. డ్రెస్‌ హైలైట్‌ అయితే, మేకప్‌ మ్యూట్‌గా ఉంటుంది. ఇది నా ఫ్యాషన్‌ సీక్రెట్‌! కానీ ఇన్నాళ్ల ఫ్యాషన్‌ జర్నీలో నేర్చుకున్న అసలైన విషయం ఏంటంటే, ఏది ధరించినా హ్యాపీగా ఉంటే చాలు, అదే బ్యూటీ!  అంటోంది జాక్వెలిన్‌  ఫెర్నాండెజ్‌

అందాన్ని రెట్టింపు చేయాలంటే ముందుగా చేతులనే ముస్తాబు చేయాలి! దానికి బెస్ట్‌ ఆప్షన్‌  ఈ ‘హాథ్‌ ఫూల్‌’ జ్యూలరీ. ఇది బ్రేస్‌లెట్‌ కాదు, రింగ్‌ కాదు... చేతి మణికట్టు నుంచి వేళ్ల చివరి వరకు సాగే ఒక గొలుసు. ఇది వేసుకున్నాక చూసే వాళ్లు చేతులను చూడకుండా ఉండలేరు. అంతలా అట్రాక్ట్‌ చేస్తుంది. 

పూర్వం రాజకుమార్తెలు, మహారాణులు వేసుకునే ఈ ఆభరణం, ఇప్పుడు మోడ్రన్‌ పెళ్లికూతుర్లకు, ఫ్యాషన్‌ లవర్స్‌కి ఫేవరెట్‌గా మారింది. అయితే, ఇది వేసుకున్నాక చేతులను చాలా జాగ్రత్తగా స్టయిలింగ్‌ చేసుకోవాలి. హాథ్‌ ఫూల్‌ పెద్దదైతే చేతిని వేరే ఏ జ్యూలరీతోనూ స్టయిల్‌ చేయొద్దు.

లేదంటే మీ చెయ్యి ఒక డిజైనర్‌ షోరూమ్‌లా కనిపిస్తుంది. సింపుల్‌ మేకప్, లైట్‌ జ్యూలరీ, మల్లెపూల బన్‌ దీనికి బెస్ట్‌ కాంబినేషన్‌. అప్పుడు చీర, లెహంగా, అనార్కలీ డ్రెస్‌ ఏదైనా హాథ్‌ ఫూల్‌ వేసుకుంటే లుక్కే మారిపోతుంది. ముఖ్యంగా ఫొటో షూట్స్, మెహందీ ఫంక్షన్లు, సంగీత్‌ పార్టీల్లో ఇది ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు.  ఇక్కడ జాక్వెలిన్‌  ధరించిన జ్యూలరీ బ్రాండ్‌: కోహార్‌ బై కనికా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆమె ధరించిన చీర బ్రాండ్‌: ఎకయాధర: రూ. 40,075.

(చదవండి: సైలెంట్‌ డీ హైడ్రేషన్‌..! హెచ్చరిస్తున్న వైద్యులు)

Advertisement
 
Advertisement
Advertisement