అద్దమంటి ఆకృతి..! | Reflecting Style: Asymmetrical Mirrors Other Fashion Trends | Sakshi
Sakshi News home page

అద్దమంటి ఆకృతి..! ర్యాంప్‌ పై రిఫ్లెక్షన్‌..

Jul 11 2025 9:48 AM | Updated on Jul 11 2025 9:48 AM

Reflecting Style: Asymmetrical Mirrors Other Fashion Trends

ముఖాన్ని మాత్రమే కాదు మన ఆత్మవిశ్వాసాన్నీ చూపుతుంది అద్దం.అద్దం లాంటి ఆకృతి కాదు, ఆకృతే అద్దంగా మారుతోంది.అద్దాన్ని ఫ్యాబ్రిక్‌కి జత చేసి, ధరించడం ఎవర్‌గ్రీన్‌గా పేరొందిన స్టైల్‌. వాటిలో .. అసిమెట్రిక్‌ మిర్రర్‌ స్టైల్‌ నేడు ఫ్యాషన్‌ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అద్దం కేవలం స్టైల్‌ కాదు ఒక స్టేట్‌మెంట్‌. ర్యాంప్‌ పై రిఫ్లెక్షన్‌

ప్రముఖ డిజైనర్లు గౌరవ్‌ గుప్తా, వ్యాన్‌ హెర్పెన్‌ వంటి వారు మిర్రర్‌ వర్క్‌ డిజైన్స్‌తో తమ హవా కొనసాగించారు. గాలా, కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌లలోనూ సెలబ్రిటీలు మిర్రర్‌ షైనింగ్‌ గౌన్స్‌లో మెరుస్తున్నారు. 

స్ట్రీట్‌ స్టైల్‌
ఈ ట్రెండ్‌ ఫ్యాషనబుల్‌గా కనిపించడానికే కాదు, జీన్స్‌ టాప్స్‌ లో అసిమెట్రిక్‌ హేమ్‌ లైన్, మిర్రర్‌ బెల్ట్స్, శాలువాలు, బ్యాగ్స్, ఇయర్‌ రింగ్స్, ఫుట్‌వేర్‌ ..  ఇలా అన్ని యాక్సెసరీస్‌ లో ఈ బిగ్‌ మిర్రర్‌ టచ్‌ కనిపిస్తోంది.

అద్దం, డిజైన్‌తో డ్రెస్‌ స్పెషల్‌గా ఉంటుంది కాబట్టి ఇతర  హంగులేవీ అక్కర్లేదు. మదిని మరింత మెరుపుగా సింగారించడానికి అద్దం వర్క్‌ కొత్తగా రూపుకడుతుంది. పర్ఫెక్ట్‌ షేప్‌తో డ్రెస్‌ అందంగా కనిపిస్తుంది అనేది ఒక కోణం మాత్రమే. నిజమైన ఫ్యాషన్‌ అనేది మిర్రర్‌ డిజైన్స్‌లోనూ ఉంటుంది. అసిమెట్రికల్‌ బ్యూటీని అర్థం చేసుకునే వారికి ఇది ఓ వేడుక కూడా.  

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సంగీత్‌ వర్మ్‌ మిర్రర్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌ డిజైన్స్‌లో మేటిగా నిలిచారు. రెడ్‌ కార్పెట్, వివాహ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ఈ మిర్రర్‌ డ్రెస్సులు మరింత అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. 

(చదవండి: Prajakta Koli : అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌గా ఆమె..! వన్‌ అండ్‌ ఓన్లీ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement