
ఒక్క చూపుతోనే అందరి చూపునూ తనవైపు తిప్పుకొనే మ్యాజిక్ నిధి అగర్వాల్‌ది. ట్రెండ్స్ వెంట పరుగెట్టకుండా, సింపుల్ స్టయిలింగ్‌తోనే గ్లామర్‌ని క్రియేట్ చేస్తుంది. స్టయిలింగ్‌లో కొత్తదనాన్ని, కాన్ఫిడెన్స్‌ను మిక్స్ చేసే నిధి స్టయిల్ సీక్రెట్ మీకోసం. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్: నితికా గుజ్రాల్, ధర: రూ. 2,18,500, జ్యూలరీ: బ్రాండ్ ముసలద్దీన్ జెమ్స్ అండ్ జ్యూలర్స్, ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
ఔట్‌ఫిట్ చాయిస్‌లో ఎప్పుడూ కంఫర్ట్, స్టయిల్ రెండూ ఉండేలా చూసుకుంటాను. ఏ ఒక్కటి తగ్గినా స్టయిలింగ్ పర్ఫెక్ట్‌గా కుదరదు. డ్రెస్‌కు సరిపోయే మేకప్ తప్పనిసరి. ఎక్కువగా మినిమల్ మేకప్, జ్యూలరీనే ప్రిఫర్ చేస్తానని చెబుతోంది నిధి అగర్వాల్.
నుదుటిన మెరిసే మ్యాజిక్!
నుదుటి మధ్యలో వేలాడుతూ ఉండే ఈ మాంగ్ టిక్కా ఒక చిన్న ఆభరణం మాత్రమే కాదు, అమ్మాయిలకు క్వీన్ ఫీలింగ్ ఇచ్చే మాయాజాలం. పెళ్లి, సంగీత్, మెహందీ, పార్టీ– ఏ సందర్భమైనా సరే, పాపిట బిళ్ల వేసుకున్న వెంటనే మిగతా ఆభరణాలు అన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాయి. చీర కట్టుకుంటే గోల్డ్ లేదా కుందన్స్ పాపిట బిళ్ల మెరుస్తూ రాయల్టీ టచ్ ఇస్తుంది.
లెహంగా లేదా హాఫ్‌శారీ అయితే పర్ల్ లేదా స్టోన్ పాపిటి బిళ్లతో మెరిసిపోతూ ప్రిన్సెస్ లుక్ గ్యారంటీ! వెస్ట్రన్ గౌన్ వేసుకున్నారా? పాపిట బిళ్ల కూడా మినిమల్ స్టయిల్‌కి వచ్చి మీ లుక్‌ను మరింత స్టయిలిష్‌గా మార్చేస్తుంది. మధ్య పాపట ఉండే హెయిర్ స్టయిల్స్ ఎంచుకుంటే మంచిది.
ఎందుకంటే, మధ్య భాగం జుట్టుతో పాపట బిళ్ల వేసుకుంటే ఫొటోలు సూపర్‌గా వస్తాయి, పెళ్లిపూల జడతో కలిపితే మాత్రం ఇక నువ్వే అసలైన మహారాణి! మార్కెట్లో ఎన్నో రూపాల్లో లభిస్తున్నాయి. గోల్డ్, వెండి, కుందన్ డిజైన్స్‌లోనూ. జ్యూలరీ షాపుల్లో లైట్ వెయిట్ మోడల్స్‌లోనూ ఉంటాయి, ఆన్‌లైన్‌లో అయితే కలర్‌ఫుల్ డిజైన్స్ ఒక్క క్లిక్‌తో ఇంటికి చేరిపోతాయి.
(చదవండి: 'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..)